AP News: మొన్న బుడమేరు.. నేడు పండమేరు..అతలాకుతలం చేసిన వాగులు

విజయవాడలో కాలనీలను బుడమేరు ముంచెత్తితే.. అనంతపురం శివారులో ఉన్న కాలనీలపై పండమేరు విరుచుకుపడింది. అనంతపురంలో కూడా తాజాగా కురిసిన భారీ వర్షాలతో పండమేరు వాగు శివారు కాలనీలపై విరుచుకుపడింది. భారీ వర్షాలతో కనగానపల్లి చెరువు గండి పడడంతో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించి పలు కాలనీలను ముంచెత్తింది.

AP News: మొన్న బుడమేరు.. నేడు పండమేరు..అతలాకుతలం చేసిన వాగులు
Pandameru River

Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 24, 2024 | 11:53 AM

నెలరోజుల క్రితం విజయవాడలో కురిసిన భారీ వర్షాలతో ఓవైపు కృష్ణమ్మ.. మరోవైపు బుడమేరు పొంగి పొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా బుడమేరు విజయవాడను ముంచెత్తింది. పలు కాలనీలు, వందల సంఖ్యలో ఇళ్ళు నీట మునిగి అనేక మంది నిరాశ్రయులయ్యారు. సరిగ్గా అలాగే ఇటు అనంతపురంలో కూడా తాజాగా కురిసిన భారీ వర్షాలతో పండమేరు వాగు శివారు కాలనీలపై విరుచుకుపడింది. భారీ వర్షాలతో కనగానపల్లి చెరువు గండి పడడంతో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించి పలు కాలనీలను ముంచెత్తింది. తెల్లవారుజామున పండమేరు వాగు కాలనీలను ముంచెత్తడంతో. ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే సమయం కూడా లేకుండా పోయింది.

దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. పండమేరు వాగు వరద ఉధృతికి బైక్లు, ఆటోలు కొట్టుకుపోయాయి. పండమేరు వాగు పరివాహక ప్రాంతంలోని పలు కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పండమేరు వాగు ఎంత అకస్మాత్తుగా ఉధృతంగా ప్రవహించి కాలనీలను ముంచేత్తిందో.. అంతే త్వరగా వరద ఉధృతి కూడా తగ్గింది. అయితే ఇళ్లలోకి వచ్చిన వరద నీటితో పాటు ఇళ్ళన్నీ బురదమయం అయ్యాయి. విజయవాడలో కాలనీలను బుడమేరు ముంచెత్తితే.. అనంతపురం శివారులో ఉన్న కాలనీలపై పండమేరు విరుచుకుపడింది.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి