ఒకే బస్సులో 230 మందిని కుక్కారు..! ఊపిరి ఆడక ముగ్గురు విద్యార్థులు..

ఓ ఆర్టీసీ బస్సులో అతిగా ప్రయాణికులను ఎక్కించడంతో ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. దేవనకొండ మండలం నుంచి వెళ్తున్న స్కూల్ బస్సులో 230 మంది విద్యార్థులు ఉన్నారు. తక్కువ బస్సుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకే బస్సులో 230 మందిని కుక్కారు..! ఊపిరి ఆడక ముగ్గురు విద్యార్థులు..
Representative Iomage

Updated on: Jul 23, 2025 | 6:25 AM

కర్నూలు జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారు. దీంతో బస్సులో ఊపిరాడక ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దేవనకొండ మండలం నుంచి గద్దెరాళ్ల, పల్లెదొడ్డి, ఓబుళపురం, జిల్లేడుబుడకల మాధాపురం మీదుగా వెళ్లే స్కూల్ బస్సులో 230 మంది విద్యార్థులు ఎక్కారు. దీంతో బస్సులో ఎక్కువ మంది ఉండటంతో ఊపిరి ఆడకపోవడంతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బస్సు ఆపేసి అస్వస్థతకు గురైన విద్యార్థులపై నీళ్లు చల్లారు డ్రైవర్, కండక్టర్.

ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు విద్యార్థుల కోసం మరో బస్సును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ రూట్‌లో తక్కువ బస్సులు ఉండటంతో ఇలా పరిమితికి మించి ప్రయాణికులు ఇదే బస్సులో రావాల్సి వచ్చిందంటున్నారు. నేతలు, అధికారులు దీనిపై స్పందించాలని కోరుతున్నారు. నిత్యం ఇదే రూట్‌లో వందలాది మంది విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళతారు. తిరిగి వచ్చే సమయంలో కూడా బస్సులు ఎక్కువగా లేవని విద్యార్థుల పేరెంట్స్‌ చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి