AP Govt Jobs: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా దాదాపు 39,008 టీచర్‌ పోస్టులు..నోటిఫికేషన్‌ ఇచ్చేనా?

|

Aug 02, 2023 | 9:18 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 39,008 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి తెలిపారు. 1 నుంచి 8 తరగతుల బోధనకు సంబంధించి ఆయా పాఠశాలల్లో ఈ మేరకు టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బుధవారం (ఆగస్టు 2) రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ మేరకు వెల్లడించారు. 2020-21లో 22,609 పోస్టులు ఖాళీగా ఉండగా.. 2021-22 విద్యా సంవత్సరం నాటికి ఖాళీల సంఖ్య 38,191కి పెరిగింది...

AP Govt Jobs: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా దాదాపు 39,008 టీచర్‌ పోస్టులు..నోటిఫికేషన్‌ ఇచ్చేనా?
Teacher Job Vacancies
Follow us on

అమరావతి, ఆగస్టు 2: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 39,008 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. 1 నుంచి 8 తరగతుల బోధనకు సంబంధించి ఆయా పాఠశాలల్లో ఈ మేరకు టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బుధవారం (ఆగస్టు 2) రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ మేరకు వెల్లడించారు. 2020-21లో 22,609 పోస్టులు ఖాళీగా ఉండగా.. 2021-22 విద్యా సంవత్సరం నాటికి ఖాళీల సంఖ్య 38,191కి పెరిగింది. ఇక 2022-23 నాటికి ఆ సంఖ్య 39,008కి పెరిగినట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 1,56,895 టీచర్‌ పోస్టులకుగాను ప్రస్తుతం 1,17,887 మంది పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. అంటే గడచిన రెండేళ్లలో టీచర్‌ ఉద్యోగ ఖాళీలు 16,399 మేర పెరిగాయి.

ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 662 పాఠశాలలను ఎంపికచేసినట్లు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి తన ప్రసంగంలో తెలిపారు. ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లను బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.