Viral: ఆన్‌లైన్‌లో CPU ఆర్డర్ ఇచ్చాడు.. కట్ చేస్తే.. ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి కళ్లు తేలేశాడు.!

| Edited By: Ravi Kiran

Jul 24, 2023 | 8:05 PM

ఆఫర్‌లో వచ్చిందని ఆన్‌లైన్‌లో సీపీయూ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. ఇక పార్శిల్‌ కోసం ఎదురు చూడగా.. ఆ రోజు రానే వచ్చింది. ఇంటికొచ్చిన దాన్ని ఓపెన్ చేసి చూడగా..

Viral: ఆన్‌లైన్‌లో CPU ఆర్డర్ ఇచ్చాడు.. కట్ చేస్తే.. ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి కళ్లు తేలేశాడు.!
Trending
Follow us on

ఆఫర్‌లో వచ్చిందని ఆన్‌లైన్‌లో సీపీయూ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. ఇక పార్శిల్‌ కోసం ఎదురు చూడగా.. ఆ రోజు రానే వచ్చింది. ఇంటికొచ్చిన దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు అతడు కళ్లు తేలేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్.

వివరాల్లోకి వెళ్తే.. కదిరి పట్టణానికి చెందిన ఇనయతుల్లా ఆఫర్‌లో వచ్చిందని CPU ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు. సుమారు రూ. 8600కి వచ్చే కంప్యూటర్ సీపీయూ.. ఈ నెల 15, 16వ తేదీన బుక్ చేసుకునేవారికి వెయ్యి తగ్గింపుతో అమెజాన్ ప్రత్యేక ఆఫర్ పెట్టింది. దీంతో కదిరి పట్టణానికి చెందిన ఇనయతుల్లా ఆన్‌లైన్‌లో CPU ఆర్డర్ పెట్టాడు. ఆ ఆర్డర్ డెలివరీ ఇవాళ ఇంటికొచ్చి ఇచ్చాడు అమెజాన్ డెలివరీ బాయ్. ఆ డెలివరీ బాక్స్ ఓపెన్ చేసి చూడగా.. అతడి కళ్లు తేలేశాడు. అందులో పిడకలు కనిపించాయ్. కాగా, ఆఫర్ల పేరుతో అమెజాన్ మోసం చేసిందని బాధితుడి ఇనయతుల్లా ఆరోపిస్తున్నాడు.