Andhra Pradesh: ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు

|

Nov 24, 2021 | 3:26 PM

సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును సభలో మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. రోజూ 4 ఆటలు ఉండాల్సింది.. పది నుంచి 12 షోలు వేస్తున్నారని పేర్కొన్నారు.

Andhra Pradesh: ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు
Ap Govt
Follow us on

సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును సభలో మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ బిల్లకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని కీలక కామెంట్స్ చేశారు. థియేటర్‌లో రోజూ 4 ఆటలు వేయాల్సింది.. పది నుంచి 12 షోలు వేస్తున్నారని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతో కొందరు ఉన్నారని చెప్పుకొచ్చారు. బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేసేందుకు ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మితేనే దోపిడీ అరికట్టగలమని స్పష్టం చేశారు.  ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే షోలు ప్రదర్శించాలని తేల్చి చెప్పారు. పరిశ్రమ ప్రభుత్వ నిబంధనలకు లోబడే నడుచుకోవాలన్నారు. ఇష్టానుసారంగా నడుచుకునే అవకాశం ఇవ్వమని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చినట్లు మంత్రి పేర్ని నాని తెలపారు. టాక్స్‌ల విషయంలో కూడా స్పష్టత ఉండటం లేదని… టాక్స్‌ల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా ఉండేందుకు కూడా ఆన్ లైన్ విధానం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

తక్కువ రేటుకు ప్రజలకు వినోదంతో పాటు ప్రభుత్వానికి టాక్స్‌ల రూపంలో ఆదాయం సరిగ్గా వస్తుందని మంత్రి వెల్లడించారు.  సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వంపై నిందలు వేస్తే అర్థం ఉంటుంది కానీ, ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంపై బురద వేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు, ఒక వర్గం మీడియాపై పేర్ని నాని సెటైర్లు వేశారు.  ప్రభుత్వం అప్పుల కోసం ఈ విధానం తీసుకొస్తున్నట్లు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. బస్సు, రైలు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి లేని అభ్యంతరం సినిమా టిక్కెట్లపై ఎందుకు? అని ప్రశ్నించారు. అత్యంత సౌలభ్యకరంగా సినిమాను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. డబ్బులు పోగు చేసుకోవాలని…అప్పులు తేవాలని ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేవారు. క్యూలైన్‌లో నిలబడే అవసరం లేకుండా…టిక్కెట్లు తీసుకోవచ్చని తెలిపారు.

ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షోలో ఉంటాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అదనపు షోలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. చిన్న సినిమా,పెద్ద సినిమా తేడా లేదని…కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతిస్తామన్నారు. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ఉంటుందని వెల్లడించారు. గతంలో పెద్ద హీరో సినిమాలకు 200 నుంచి 500 రూపాయలకు పైగా అమ్మిన పరిస్థితి ఉందని.. ఇప్పుడు అలాంటి పద్దతులు కుదరవన్నారు.

కాగా రాబోయే ఆరు నెలల్లో  పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఏపీ సర్కార్ నిర్ణయంతో.. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య, పుష్ప, భీమ్లా నాయక్ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: గుటక గుటకలో గరళం.. గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు.. టీ తాగేవారికి షాకింగ్ న్యూస్

టమాటా రేటు పెరిగింది.. పంట పండింది.. కుబేరుడైన కర్నూలు జిల్లా రైతు