Onion Price: తగ్గిన దిగుబడి.. పెరిగిన ఉల్లి ధర.. కట్ చేయకుండానే కన్నీరు పెట్టిస్తోందిగా..

| Edited By: Surya Kala

Nov 05, 2023 | 8:04 AM

తెలుగు రాష్ట్రాలలోనే ఉల్లి పంటను అత్యధికంగా పండించేది ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే. ఈసారి వర్షాలు లేకపోవడంతో దిగుబడి  గణనీయంగా  తగ్గింది. అయినప్పటికీ రోజుకు 5000 క్వింటాలకు పైగా ఉల్లి కర్నూలు మార్కెట్ కు తరలి వస్తుంది. నాణ్యమైన ఉల్లి ధర క్వింటాల్ 5 వేల రూపాయల వరకు పలుకుతుంది.

Onion Price: తగ్గిన దిగుబడి.. పెరిగిన ఉల్లి ధర.. కట్ చేయకుండానే కన్నీరు పెట్టిస్తోందిగా..
Onion Price Hike
Follow us on

కర్నూలు జిల్లాలో ఉల్లి ధరలు భగభగ మండుతూనే ఉన్నాయి. వినియోగదారులు కొనలేని పరిస్థితి నెలకొంది. రైతులకు కాస్త ఊరట లభిస్తున్నప్పటికీ దిగుబడి విషయంలో ఘోరమైన దెబ్బ తగిలింది. తీవ్ర వర్షాభావం కారణంగా వర్షాలు లేక పూర్తిగా దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఉల్లి దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయని చెప్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలోనే ఉల్లి పంటను అత్యధికంగా పండించేది ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే. కర్నూలు జిల్లాలోని కర్నూలు రూరల్ కోడుమూరు గూడూరు బెలగల్ ఎమ్మిగనూరు గోనెగండ్ల డోన్ ప్యాపిలి తదితర ప్రాంతాలలో ఉల్లి పంటను అత్యధికంగా పండిస్తారు. ఈసారి వర్షాలు లేకపోవడంతో దిగుబడి  గణనీయంగా  తగ్గింది. అయినప్పటికీ రోజుకు 5000 క్వింటాలకు పైగా ఉల్లి కర్నూలు మార్కెట్ కు తరలి వస్తుంది. నాణ్యమైన ఉల్లి ధర క్వింటాల్ 5 వేల రూపాయల వరకు పలుకుతుంది. గతంలో ఇంత ధరలు ఎప్పుడూ లేవని చెప్తున్నారు. ఉల్లి అత్యధికంగా మార్కెట్ కు వస్తుండడంతో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇతర జిల్లాలలోని రైతు బజార్లలో సబ్సిడీపై విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కర్నూలు మార్కెట్ లోని ఉల్లిని అధికారులు కొనుగోలు చేసి ఒంగోలు నెల్లూరు లాంటి జిల్లాలకు ఎగుమతి చేసి సరఫరా చేస్తున్నారు.

సప్లై తగ్గిపోవడం కారణంగానే ఉల్లి ధరలు పెరగడానికి కారణం అని వ్యాపారులు అంటున్నారు. గుజరాత్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కొంతమేర వర్షాలు కురవడంతో అక్కడ దిగుబడి పెరిగినట్లు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర ప్రాంతాలలోని ఇతర దేశాలలోని ఉల్లిని దిగుమతి చేసి ధరలను అదుపులో ఉంచాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కర్నూలులో కొనుగోలు చేసి ఇతర జిల్లాలో సబ్సిడీపై పంపిణీ చేసేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసిన ఉల్లి జిల్లాలకు తరలివస్తే ధరలు అదుపులోకి రావచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీనికి తోడు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలలో పండిన ఉల్లి మార్కెట్లలోకి వస్తే ధరలు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు దీర్ఘకాలంగా కొనసాగడానికి అవకాశం లేదని త్వరలోనే కంట్రోల్ లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడి కంటిలో నీటిని తెప్పిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో ధరలు కంట్రోల్లో ఉంటాయని అధికారులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..