Jaggaiahpet: ఎన్టీఆర్‌ జిల్లాలో బాయిలర్‌ పేలుడు… సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

|

Jul 07, 2024 | 9:32 PM

జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలి ఓ కార్మికుడు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను విజయవాడలోని ఆంధ్రా, మణిపాల్‌ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Jaggaiahpet: ఎన్టీఆర్‌ జిల్లాలో బాయిలర్‌ పేలుడు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Boiler Exploded
Follow us on

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలిన ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆవుల వెంకటేష్‌ అనే కార్మికుడు మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ లోని ఆంధ్రా, మణిపాల్‌ ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

బాయిలర్ పేలిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలన్నారు సీఎం. ఈ ఘటనపై సమగ్ర నివేదికతో ఇవ్వడంతో పాటు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  ఆంధ్రా, మణిపాల్‌ ఆస్పత్రుల్లో క్షతగాత్రులను కలెక్టర్‌, సీపీ పరామర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు విజయవాడ సీపీ. దర్యాప్తులో ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..