AP News: ఏపీలోని ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు

AP News: ఏపీలోని ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు

Ram Naramaneni

|

Updated on: Jul 07, 2024 | 9:02 PM

ఏపీలోని ప్రకాశం జిల్లాలో... శ్రీరాముడు, సీతాదేవీ ఆనవాళ్లు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారి పాదముద్రలు ఉన్నాయని ఆలయ అర్చకులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయుని పల్లి సమీపంలోని ప్రాచీన దేవాలయంలో 15వ శతాబ్దం నాటి శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిలా శాసనాల ఆధారంగా శ్రీరాముడు, సీతాదేవీ ఆనవాళ్లు ఇక్కడ కనిపించాయి. శ్రీరాముడు, సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ కొన్నిరోజులపాటు ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేసినట్లుగా ఆనవాళ్లు చెబుతున్నాయి. వారి పాదముద్రలు ఉన్నాయని ఆలయ అర్చకులు వెల్లడించారు. ఆలయంలో సిద్ధబైరవేశ్వరుడు, అమ్మవారు కొలువై ఉన్నారని ఈ ఆలయానికి వెయ్యి ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ అర్చకులు తెలిపారు.

అంతేకాకుండా సీతమ్మవారు స్నానమాచరించడానికి రాములవారు ఆలయ సమీపంలో ఒక బావిని తవ్వించారని ఆ బావికి సీతమ్మ బావిగా నామకరణం చేశారని అర్చకులు తెలిపారు. ఆలయంలో వీరభద్రుడు, అమ్మవారు, వినాయకుడు, హనుమంతుడు, నాగేంద్రుడు విగ్రహాలు 15వ శతాబ్దం నాటివని అర్చకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలు సుభిక్షంగా ఉండేందుకు దామర్ల రాజులు వీరభద్రుడు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ స్థలపురాణం చెబుతున్నట్లు చెప్పారు అర్చకులు. ఆలయం తూర్పు భాగాన పెద్ద చెరువును తవ్వించారని.. ప్రస్తుతం 16 గ్రామాలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మండలంలోని అతిపెద్ద చెరువులలో ఇదొకటన్నారు. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఈదేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్థులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..