Attack on doctor: మద్యం మత్తులో డ్యూటీ డాక్టర్ పై దాడి.. గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

| Edited By: Surya Kala

Nov 03, 2023 | 10:18 AM

రైలు ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున గాయాలపాలై అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు హౌస్ సర్జన్స్ కీలకంగా వ్యవహరిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఘటనతో వైద్యులు విధులకు హాజరు కాకపోతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బంది పడతారని గమనించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Attack on doctor: మద్యం మత్తులో డ్యూటీ డాక్టర్ పై దాడి.. గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
House Surgeon
Follow us on

విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న హౌస్ సర్జన్ సువర్ణ కుమార్ పై దాడి దిగాడు ఓ మందు బాబు. అంతే కాకుండా ప్రక్కనే ఉన్న మరో మహిళ హౌస్ సర్జన్ ను సైతం అసభ్యకర పదజాలంతో అవమానిస్తూ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో మందుబాబులను పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చేసేదిలేక వెంటనే డాక్టర్స్ అదే ఆసుపత్రి ఔట్ పోస్టులో ఉన్న పోలీసులకు జరుగుతున్న గొడవకు సంభందించి సమాచారం ఇచ్చి తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు కూడా వెంటనే స్పందించకపోగా తెల్లవారిన తరువాత చూద్దాం, ఇప్పుడు మీరు వెళ్లిపోండి అని చెప్పి వైద్యులను ఔట్ పోస్ట్ నుండి పంపించేశారు పోలీసులు. ఆ సమయంలో అక్కడ ఒక భయానక వాతావరణమే నెలకొంది. చేసేది లేక డాక్టర్స్ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఉదయాన్నే జరిగిన విషయాన్ని తమ తోటి డాక్టర్స్ తో పాటు ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా తమ పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకునే వరకు తాము విధులకు హాజరు కాలేమని తేల్చి చెప్పారు. అప్పటికే రైలు ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున గాయాలపాలై అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు హౌస్ సర్జన్స్ కీలకంగా వ్యవహరిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఘటనతో వైద్యులు విధులకు హాజరు కాకపోతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బంది పడతారని గమనించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి చేసిన నిందితుడు వచ్చిన కారును గమనించిన హౌస్ సర్జన్స్ ఆ కారు నెంబరును పోలీసులకి ఇచ్చారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రక్రియ ఈజీగా మారింది. అలా ఆ కార్ నెంబర్ సహాయంతో డాక్టర్స్ పై దాడికి దిగిన నిందితుడు ఇంటి యశ్వంత్ గా గుర్తించారు. యశ్వంత్ పైడితల్లి అమ్మవారి పండుగ కోసం తన స్నేహితులతో కలిసి వైజాగ్ నుండి విజయనగరం వచ్చాడు. ఆ సమయంలో తన స్నేహితుడుకి రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే అక్కడ రైలు ప్రమాద ఘటనలోని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

దీంతో యశ్వంత్ స్నేహితుడికి ప్రాథమిక సేవలు అందించడం కొంత ఆలస్యం అయ్యింది. మద్యం మత్తులో ఉన్న యశ్వంత్ అసహనానికి గురై వైద్యులపై విరుచుకు పడినట్లు గుర్తించారు పోలీసులు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు ప్రశాంత్ ని అదుపులో తీసుకొని రిమాండ్ కు పంపించారు. నిందితుడు యశ్వంత్ అరెస్ట్ తో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ లోని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..