Andhra Pradesh: ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. లేటు వయసులో తోడు కోసం.. ఒక్కటైన వృద్ధ జంట

ఎవరో ఒకరి సాయం తప్పనిసరి... ఆ సమయంలో రాములమ్మ సహకారంతో మూర్తి కోలుకున్నారు...ఇద్దరి ఇష్టంతో తనపై రాములమ్మ చూపిన ప్రేమతో ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో శుక్రవారం వీరికి పెళ్లి జరిపించారు. మేమిద్దరం ఇష్టపడ్డామని, పెళ్లి చేసుకుంటామని నిర్వాహకులకు చెప్పారు... అంతే ఇంకేముంది వృద్ధాశ్రమంలోనే దండలు మార్చి పెళ్లి జరిపించేశారు నిర్వాహకులు..

Andhra Pradesh: ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. లేటు వయసులో తోడు కోసం.. ఒక్కటైన వృద్ధ జంట
Old Couple Marriage

Edited By:

Updated on: Jan 18, 2025 | 1:54 PM

వయసు అయిపోయిన వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు….వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల మనసులు కలిశాయి. వయసులో ఉన్నప్పటి కంటే.. ఇప్పుడే ఒకరికి ఒకరి తోడు ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. తామిద్దరం ఇష్టపడ్డామని, పెళ్లి చేసుకుంటామని నిర్వాహకులకు చెప్పారు….. అంతే ఇంకేముంది వృద్ధాశ్రమంలోనే దండలు మార్చి పెళ్లిని జరిపించేశారు నిర్వాహకులు..

ఆశ్రమంలో ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి.. వారిద్దరినీ ఒకటి చేశారు. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఈ పెళ్లికి వేదికైంది వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ(68), రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన మడగల మూర్తి(64) ఇద్దరూ ఈ ఆశ్రమంలో ఉంటున్నారు. రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు..

ఎవరో ఒకరి సాయం తప్పనిసరి… ఆ సమయంలో రాములమ్మ సహకారంతో మూర్తి కోలుకున్నారు…ఇద్దరి ఇష్టంతో తనపై రాములమ్మ చూపిన ప్రేమతో ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో శుక్రవారం వీరికి పెళ్లి జరిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..