Vijayawada Passport: కరోనా కేసులు విపరీతంగా పెరిగిన క్రమంలో గత కొన్నిరోజులుగా పలు సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా అత్యవసర సేవలకు మాత్రమే మనిహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్ వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అత్యవసర పనులపై విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు పాస్ పోర్టు సేవలను తిరిగి ప్రారంభించారు.
అత్యసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతో రోజుకు 3 గంటల మేర సేవలందించాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే సాధారణ రోజుల్లో అధికారులు రోజుకు సగటున 250 వరకు పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలిస్తుంటారు. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో.. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యాలయం పనిచేస్తుంది. కొవిడ్ నిబంధనలను అనుసరించి ప్రతి రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్ కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అత్యవసరమైతేనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ శ్రీనివాస్ ప్రజలను కోరారు.
Also Read: Beggar murder : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు యాచకుల మధ్య గొడవ.. ఒకరు మృతి