
బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు అలెర్ట్. మరీ ముఖ్యంగా ఏపీ వాసులకు ఈ ముఖ్య గమనిక. 12510 నెంబర్‌తో గౌహతి-ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు జరిగాయి. ఈ టైమింగ్స్ చేంజ్ జూన్ 5న.. కేవలం ఒక్క రోజు మాత్రమేనని రైల్వే అధికారులు తెలిపారు. వాస్తవానికి సోమవారం ఉదయం 6.20 గంటలకు గౌహతి నుంచి బయల్దేరాల్సిన ఈ ట్రైన్.. మధ్యాహ్నం 3.20 గంటలకు స్టార్ట్ అవుతుంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన నేపధ్యంలో ఈ రైలు సమయాల్లో మార్పులు జరిగాయన్నారు రైల్వే అధికారులు.
ఇక ఈ ట్రైన్‌కు ఏపీలో పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. అటు 12665 నెంబర్‌తో హౌరా-కన్యాకుమారి మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా జూన్ 5న రద్దు చేసింది రైల్వేశాఖ. ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రయాణీకులు ఈ మార్పును గమనించాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. కాగా, ఈ ట్రైన్ టైమింగ్స్‌కు సంబంధించిన మార్పులను రైల్వే విచారణ నంబర్ 139 ద్వారా కానీ, లేదా రైల్వే స్టేషన్లలోని విచారణ కౌంటర్లలో తెలుసుకోవాలని సూచించారు.
Bulletin No.17 dt.05.06.2023 on “Cancellation / Rescheduling of Trains” pic.twitter.com/24twOecff0
— South Central Railway (@SCRailwayIndia) June 5, 2023