NTR Health University: హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై స్పందించిన లక్ష్మీపార్వతి.. వారే టార్గెట్‌గా షాకింగ్ కామెంట్స్..

|

Sep 26, 2022 | 12:06 PM

NTR Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నేపథ్యంలో తనపై మీడియాలో వస్తున్న కథనాలపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

NTR Health University: హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై స్పందించిన లక్ష్మీపార్వతి.. వారే టార్గెట్‌గా షాకింగ్ కామెంట్స్..
Laxmi Parvathi
Follow us on

Laxmi Parvathi: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నేపథ్యంలో తనపై మీడియాలో వస్తున్న కథనాలపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి తీవ్రంగా ఫైర్ అయ్యారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై కేసులు పెడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కొన్ని మీడియా సంస్థలు కించపరుస్తున్నాయని, వాస్తవాలు ప్రజలకు తెలియాలనే మీడియా ముందకు వచ్చానని అన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనవర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందన..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై లక్ష్మీపార్వతి స్పందించారు. తాను స్పందించలేదంటూ ఎన్టీఆర్ హంతకులు హడావుడి చేస్తున్నారని ఫైర్ అయిన ఆమె.. చంద్రబాబు, మరికొందరు మీడియా ప్రతినిధులపై దుమ్మెత్తిపోశారు. అధికారంలో ఉన్న ఏరోజైనా ఎన్టీఆర్ పేరు పెట్టావా? అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేయాలని మీడియా ప్రతినిధిలో నువ్వు మాట్లాడలేదా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారామె. ఎన్టీఆర్‌ను అగౌరవపరిచేలా మాట్లాడే వీరికి ఆయన పేరును ఉచ్ఛరించే హక్కు కూడా లేదన్నారు. జిల్లా పేరు ఎన్టీఆర్ కావాలా? యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ కావాలా? అంటే తాను జిల్లా పేరునే తాను ఎంపిక చేసుకుంటానని అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై సీఎం జగన్ స్పష్టమైన వివరణ ఇచ్చారని అన్నారు. ఎన్టీఆర్‌పై కోపంతో పేరు మార్చలేదన్నారు. జిల్లాకు పేరు పెట్టడంలోనే వైఎస్ జగన్‌కు ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత జీవితంపై క్లారిటీ..

ఇదే సమయంలో తన వ్యక్తిగత జీవితంపై అసత్యప్రచారం చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు లక్ష్మీపార్వతి. ఆమె కామెంట్స్ యధావిధిగా ‘నా వ్యక్తిగత జీవితంపై కొన్ని మీడియా సంస్థలు దాడి చేస్తున్నాయి. ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఎన్టీఆర్‌తో నా వివాహం చంద్రబాబుకు మొదటి నుంచీ ఇష్టం లేదు. మా వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదు. అందరి సమక్షంలోనే ఎన్టీఆర్‌తో నా వివాహం జరిగింది. ఎన్టీఆర్‌‌కు ద్రోహం చేసినవారే.. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారు. చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. అధికార వ్యామోహంతో పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నించారంటూ నాపై తప్పుడు ప్రచారం చేస్తుననారు. నాడు టెక్కలి సీటు ఆఫర్ చేసినా నేను తీసుకోలేదు. గతంలో ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్లను చూసి మాట్లాడండి. ఎన్టీఆర్ చివరి ఇంటర్వ్యూలో మా వివాహం గురించి చాలా స్పష్టంగా చెప్పారు.’ అంటూ నాటి ఎన్టీఆర్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను ప్లే చూసి చూపారు లక్ష్మీపార్వతి.

నాడు చంద్రబాబు దుర్మార్గానికి కుటుంబ సభ్యులు వంతపాడారన్నారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు లక్ష్మీపార్వతి. ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. తాను ఎలాంటి స్వార్థం కోసం ఎన్టీఆర్ జీవితంలోకి రాలేదని, తాను ఏ రోజూ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానం గురించి అందరికీ తెలుసునని అన్నారు. అధికార దాహంతోనే చంద్రబాబు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989లో ఓడిపాయామని ఎన్టీఆర్ ఆనాడు చెప్పారని లక్ష్మీపార్వతి అన్నారు. తాను ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక టీడీపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇంకా లక్ష్మీపార్వతి చేసిన కామెంట్స్ కింది వీడియోలో చూడొచ్చు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..