Janasena: పెడన వారాహి యాత్రలో ఆసక్తికర దృశ్యం.. పవన్‌‌కు తారక్‌ అభిమానుల మద్దతు.. భారీగా హాజరు..

|

Oct 05, 2023 | 8:10 AM

ఏపీలో జనసేన-టీడీపీ జట్టు కట్టి ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు తారక్‌ ఫ్యాన్స్‌ కూడా పవన్‌ వారాహి యాత్రలో మద్దతుగా నిలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. పవన్‌ వారాహి యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇప్పుడు తారక్‌ ఫ్యాన్స్‌ కూడా వస్తుండటంతో రోడ్‌ షోలు, సభలు కిక్కిరిసిపోతున్నాయి. పెడనలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కొత్త లాజిక్‌ చెప్పారు.

Janasena: పెడన వారాహి యాత్రలో ఆసక్తికర దృశ్యం.. పవన్‌‌కు తారక్‌ అభిమానుల మద్దతు.. భారీగా హాజరు..
Ntr Fans With Janasena
Follow us on

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో జరిగినప్పుడు ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి చేయగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ వారాహి యాత్ర జరుగుతున్న సందర్భంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. తారక్‌ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లా పెడనలోవారాహి యాత్రలో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు కలిసి వారాహి యాత్రలో పాల్గొన్నారు. ఫ్యాన్స్‌ పట్టుకున్న ఫ్లెక్సీ ఫ్రేముల్లో ఒక వైపు తారక్‌, మరోవైపు పవన్ ఫోటోలుండటం అందర్నీ ఆకర్షించింది. రెండు ఫోటోలకు రెండు రకాల క్యాప్షన్లు పెట్టారు.

ఇప్పటికే ఏపీలో జనసేన-టీడీపీ జట్టు కట్టి ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు తారక్‌ ఫ్యాన్స్‌ కూడా పవన్‌ వారాహి యాత్రలో మద్దతుగా నిలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. పవన్‌ వారాహి యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇప్పుడు తారక్‌ ఫ్యాన్స్‌ కూడా వస్తుండటంతో రోడ్‌ షోలు, సభలు కిక్కిరిసిపోతున్నాయి.

 

ఇవి కూడా చదవండి

తాజాగా పెడనలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కొత్త లాజిక్‌ చెప్పారు. జగన్‌ను పాతాళానికి తొక్కెయ్యాలంటే తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటపటిమ అవసరమన్నారాయన. ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు పవన్.

వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో పర్యటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌. సీఎం జగన్‌పై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము లేదని, వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని ఆరోపించారు పవన్‌. రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. జగన్‌ను గద్దె దించడానికి ఉమ్మడిపోరాటం అవసరమని చెప్పారు. జగన్‌ పెట్టే కేసులకు భయపడబోనని పవన్‌ చెప్పారు.

ప్రజలను కులాలుగా విడదీసి తాను రాజకీయాలు చేయబోనని, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ సమానంగా చూస్తానన్నారు పవన్‌. ఏపీలో కుల భావన ఎక్కువ, ఒక్కటే అనే జాతి భావన తక్కువని చెప్పారాయన. యువత కులాలకు అతీతంగా ఆలోచించాలని, ఏపీ ప్రయోజనాల కోసం అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..