Andhra: అబ్బా.. వీటికి అంత సీన్ వుందా … వీటి పేరు ఏంటో తెలుసా..?

పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉండే పండ్లు రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పండు నోని. భారతదేశంలోనే పెరిగే ఈ పండు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Andhra: అబ్బా.. వీటికి అంత సీన్ వుందా ... వీటి పేరు ఏంటో తెలుసా..?
Noni Fruit

Edited By:

Updated on: Dec 24, 2025 | 8:05 PM

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవాళ్లు తప్పకుండా ఫ్రూట్స్ ఇష్టపడతారు. రోజుకో ఆపిల్ తినండి అని కొందరు చెబితే.. మరికొందరు మన ప్రాంతంలో దొరికే జామ కాయ అంతకంటే మంచిది అని సలహా ఇస్తారు. అయితే ఏది ఏమైనా పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు , ఖనిజాలు, ఫైబర్ శరీరానికి ఎంతో అవసరము. వీటిని నిత్యం తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగటంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇవి శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వటంతో పాటు చర్మం , గుండె , కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఏ పండు దేనికి పనిచేస్తుంది

ఆపిల్ గుండెకి మేలు చేస్తే.. అరటిపండు తినటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నారింజలో విటమిన్ C ఉండటం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. పండ్లలో రారాజు మామిడిలో విటమిన్ A, C పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది , ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతారు వైద్యులు , డైటీషియన్లు. అందుకే ప్రతి ఒక్కరు తమ ఆహారం లో రోజూ 2 నుంచి మూడు రకాల పండ్లు తీసుకోవాలని చెబుతారు.

ప్రకృతి మనకు అందించిన మరో వరం నోని..

పండ్ల గురించి మనలో చాలా మందికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అయితే సీజన్‌ను బట్టి ప్రాంతాన్ని బట్టి అక్కడ లభించే పండ్లు ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఆహారం లో తీసుకుంటారు. ఇపుడు వాణిజ్యం విస్తృతి పెరగటంతో దేశీయంగా లభించే పండ్లతో పాటు విదేశీ ఫలాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే నోని పండు మన భారతదేశంలోనే పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండు మనకు ప్రకృతి ప్రసాదించిన వరంగా చెబుతారు. భారతదేశం సహా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే యీ నోని చెట్టు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్లు , ఖనిజాలు సంవృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధకశక్తిని మెరుగుపరుస్తాయి. ప్రాచీనకాలం నుంచి ఆయుర్వేదంలో ఈ పండ్లను వినియోగిస్తున్నారు. జ్యుస్ రూపంలో ఎక్కువగా దిన్ని తీసుకుంటారు. వాసన , రుచి కాస్త భిన్నంగా ఉన్నా ఇందులో ఉన్న ఔషధ గుణాల వలన ఈ పండు ఎంతో విలువైనదిగా ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.