ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమే.. సీఎస్‌ లేఖకు నిమ్మగడ్డ సమాధానం

రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కి

ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమే.. సీఎస్‌ లేఖకు నిమ్మగడ్డ సమాధానం

Edited By:

Updated on: Nov 18, 2020 | 9:05 AM

Nimmagadda Ramesh Answer: రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కి ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని, ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని సాహ్ని తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ బదులిచ్చారు. మీ లేఖ ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని తెలిపారు. ఇది రాజ్యంగ వ్యవస్థను కించపరచడమని, రాజ్యాంగ చట్ట విరుద్ధమని తెలిపారు. కాగా స్థానిక ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల అభిప్రాయాలపై ఈ ఉదయం గం. 11.30 కు నిమ్మగడ్డ గవర్నర్‌తో భేటీ కానున్న విషయం తెలిసిందే.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 948 కొత్త కేసులు.. ఐదుగురు మృతి.. కోలుకున్న 1,607 మంది

వ్యాక్సిన్‌ తీసుకోవడం, తీసుకోకపోవడం వారి ఇష్టం.. ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు