Andhra Pradesh: ధర్మవరంలో ఉగ్ర కలకలం..రంగంలోకి ఎన్ఐఏ.. ఒకరు అరెస్ట్

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. నూర్‌ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ధర్మవరం కోట కాలనీలో అతడిని అరెస్ట్ చేసి.. ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీస్తుంది. నూర్‌ నివాసంలో అధికారులు 16 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నూర్ ఓ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు.

Andhra Pradesh: ధర్మవరంలో ఉగ్ర కలకలం..రంగంలోకి ఎన్ఐఏ.. ఒకరు అరెస్ట్
NIA Arrests Suspected Terrorist in Dharmavaram

Updated on: Aug 16, 2025 | 10:22 AM

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ధర్మవరంలోని ఓ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న నూర్, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. నూర్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 16 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్‌కార్డుల ద్వారా అతను ఎవరితో సంప్రదింపులు జరిపాడు అనే దానిపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రితం నూర్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు ధర్మవరంలో నూర్ అనే యువకుడికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎన్‌ఐఏ అత్యంత గోప్యంగా నిర్వహించింది. గత కొంతకాలంగా నూర్‌ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ధర్మవరం ప్రాంతంలో భయాందోళనలకు దారితీసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..