NHM East Godavari Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కార్యక్రమం ద్వారా పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 117
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, సోషల్ వర్కర్, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం/బీఎస్సీ (నర్సింగ్), పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్, సంబందిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డీఎసంహెచ్‌ఓ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 19, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: