1. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆదిమూలపు సురేశ్. కడుపు నిండా కత్తులు పెట్టుకొని కౌగిలించుకొనే వ్యక్తి అని కామెంట్ చేశారు. రాజకీయాల్లో నీచమైన సంస్కృతికి చంద్రబాబు తెరలేపారని ఆరోపించారు సురేశ్.
2. ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎగువశెంభిలో ఆసరా కార్యక్రమం నిర్వహించారు అధికారులు. దీనికి పోటీగా పలు శాఖల అధికారులతో దర్భార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఒడిశా.
3. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. జనాగ్రహ దీక్షలో చంద్రబాబు, లోకేశ్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు టీడీపీ కార్యకర్తలు. ఈ ఘటనలో టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
4. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కాకినాడ దుమ్ములపేటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో సమీప ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ సామాగ్రి దగ్ధమైంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
5. విశాఖలోని పీఎంపాలెం స్టేడియం సమీపంలో కారులోంచి మంటలు వచ్చాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు కారు ఆపి బయటకొచ్చారు. వారు దిగిన క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. కాసేపు ఆ ఏరియాలో ట్రాఫిక్ జాం అయ్యింది.
6. తెలంగాణలో పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. ఏడేళ్లల్లో 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడించారు ఐటీ మంత్రి. ఇన్వెస్టర్లకు తెలంగాణ డెస్టినేషన్ అని వివరించారు కేటీఆర్.
7. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ ఆఫీసర్ సురేందర్‌ను రెండోరోజు ప్రశ్నించింది సిర్పూర్కర్ కమిషన్. NHRC బృందం తనను భయపెట్టిందని చెప్పారు ఏసీపీ సురేందర్. తాను చెప్పిన విషయాలు కాకుండా వాళ్లకు నచ్చినట్లు రాసుకున్నారని వివరించారాయన.
8. హుజూరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలకు సర్దిచెప్పారు పోలీసులు. కాగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు హరీశ్. టీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి కామెంట్స్ ఆత్మవంచనే అని అన్నారు ఆర్థిక మంత్రి.
9. తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈనెల 25, 26న స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు అధికారులు. 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలని సూచించారు ఆఫీసర్లు.
Read also: TDP Anitha: వైసీపీ నేతలు మహిళలను అవమానిస్తే సహించేది లేదు.. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత హెచ్చరిక