Married Woman died: వరకట్న వేధింపులకు నవ వధువు బలైంది. పెళ్లై ఏడాది కాకుండానే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషాద (Dowry Harassment Case) ఘటన కృష్ణ జిల్లా పామర్రు (Pamarru) లో చోటుచేసుకుంది. పామర్రులో కార్పెంటర్ కాలనీలో వివాహిత అమూల్య (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా.. వరకట్నం కోసం అల్లుడు ప్రసంగి బాబు తమ కుమార్తెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా.. పెళ్లైన కొంతకాలం నుంచే.. భార్యా భర్తల మధ్య గొడవలు జరగుతున్నాయని బంధువులు పేర్కొంటున్నారు. వరకట్నం కోసం భర్త వేధిస్తుండటంతో అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పలువురు బంధువులు పేర్కొంటున్నారు. కాగా.. పెళ్లి అయిన పది నెలలకే అమూల్య మరణించడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.
కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా వివరాలు సేకరించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పామర్రు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన అనంతరం భర్త ప్రసంగి బాబు ఇంటి నుంచి పరారయ్యాడు.
భర్త పరారీతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఒకవేళ భర్త చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడా అన్న కోణంలో విచారణ చేపట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: