చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు… ఏంటా అని వెళ్ళి చూడగా…

ఒంగోలు నగరంలో మానవత్వం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారే.. అప్పుడే పుట్టిన పసికందును చెత్తకుప్ప, కాలువ పాలు చేసి వెళ్లిపోయారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఒంగోలు నగర శివారులోని సమతా కాలనీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
Ongole Newborn Baby

Edited By:

Updated on: Sep 10, 2026 | 9:31 PM

ఒంగోలులో దారుణం జరిగింది… మానవత్వం మంట గలిసిన ఘటన చోటు చేసుకుంది… నగరంలోని సమతా నగర్లో అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్పలో పారేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు… బిడ్డ ఏడుపు విని దారిన వెళుతున్న ఓ వ్యక్తి శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డను సంరక్షించి వైద్య చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు… వైద్యులు శిశువుకు చికిత్స అందిస్తున్నారు.

ఒంగోలు నగర శివారులోని సమతా కాలనీలో జనం హడావిడిగా అటూ ఇటు తిరుగుతున్న సమయంలో గుడి దగ్గర కాలువలో ఒకరోజు నిండిన మగ శిశువును పడవేశారు… ఆ శిశువు బిగ్గరగా ఏడుస్తుండగా అదే ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న వ్యక్తులు గుర్తించి వెంటనే డయల్ 100 కి సమాచారం ఇచ్చారు… పోలీసులు ఈ విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ కు చేరవేశారు… సమాచారం అందుకున్న దినేష్ కుమార్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.వి.సాగర్ దృష్టికి తీసుకెళ్లగా అందరూ కలిసి ఆ పసికందును పోలీస్ సిబ్బంది సహకారంతో ఒంగోలు రిమ్స్ హాస్పటల్ తీసుకుని వచ్చారు. బాబుని క్రిటికల్ కేర్ యూనిట్లో లో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నారు… శిశువుకు వైద్య పరీక్షలు అందిస్తున్నామని, అబ్జర్వేషన్‌ ఉంచినట్టు వైద్యులు తెలిపారు… ఒంగోలు నగరంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కన్నప్రేమను కలుషితం చేస్తూ పసికందును కాలువలో పారేసి వెళ్లిన కఠినాత్ముల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన వాకర్లను, పోలీసులను, అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us