AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..చూసిన నెటిజన్లు షాక్!

భారతీయ రైల్వేలలో సుదీర్ఘ ప్రయాణం చేసేటప్పుడు ప్యాసింజర్లు ఇళ్ల నుంచి పూరీలు, చపాతీలు లేదా స్నాక్స్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్లడం సాధారణమే. కానీ, ఒక మహిళ ఏకంగా ఇంటి నుంచే పెద్ద పెద్ద వంట పాత్రల్లో చికెన్, అన్నం వండుకుని వచ్చి రైలు బెర్త్‌పైనే కుటుంబానికి వడ్డించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..చూసిన నెటిజన్లు షాక్!
Chicken Feast On Train
Jyothi Gadda
|

Updated on: Sep 10, 2026 | 9:13 PM

Share

రైలు ప్రయాణాలలో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకువెళ్లడం సర్వసాధారణం. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే, ఆ వీడియోలో ఒక మహిళ రైలు బెర్త్‌పై పెద్ద పెద్ద వంట పాత్రలతో తన కుటుంబానికి చికెన్, అన్నం వడ్డిస్తూ కనిపిస్తుంది. ఆ వీడియోలో, ఆహారంతో నిండిన కుండలను పై బెర్త్ చుట్టూ ఉంచి ఉన్నారు. కొంతమందికి ఈ ఆలోచన నచ్చగా, మరికొందరు పరిశుభ్రత, ప్రయాణీకుల సౌకర్యంపై ప్రశ్నలు లేవనెత్తారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ప్రత్యక్షమైన ఈ వీడియోలో ఓ మహిళ రైలు అప్పర్ బెర్త్‌పై కూర్చుని ఉంది. ఆమె పక్కన పెద్ద పరిమాణంలో ఉన్న కొన్ని వంట పాత్రలు ఉన్నాయి. అందులో ఒక పాత్ర నుంచి ఆమె స్టీలు ప్లేటులోకి ముందుగా అన్నం తీసి, ఆ తర్వాత మరో పాత్రలోని చికెన్ కర్రీని పైన వేసి క్రిందినున్న తన కుటుంబ సభ్యులకు అందిస్తోంది. రైలు బెర్త్‌ను ఒక చిన్నపాటి డైనింగ్ టేబుల్ లా మార్చి, ఎంతో ఆరామ్‌గా భోజనం వడ్డిస్తున్న ఈ దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించడంతో వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో లభించే కేటరింగ్ ఆహారం ఏమాత్రం పరిశుభ్రంగా ఉండదు. ఆరోగ్యం పాడవకుండా ఉండటానికి ఇలా ఇళ్ల నుంచే పౌష్టికాహారాన్ని తీసుకెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు అని కొందరు కామెంట్ చేశారు. ప్రయాణంలో బయటి తిండికి దూరంగా ఉంటూ, సొంత వంటకాలను ఆస్వాదించడాన్ని వారు కొనియాడారు.

మరికొందరు నెటిజన్లు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైలు అనేది అందరూ కలిసి ప్రయాణించే ఒక పబ్లిక్ స్పేస్. ఇలా పెద్ద పెద్ద పాత్రలు తేవడం, ఉమ్మడి ప్రాంగణంలో పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది అని పేర్కొన్నారు. ప్రయాణాల్లో కనీస పబ్లిక్ ఎటికేట్ పరిశుభ్రత పాటించాలని వారు హితవు పలికారు.

గతంలో కూడా రైలు బెర్త్‌పైనే కూర్చొని స్యాండ్‌విచ్‌లు తయారు చేసిన వీడియోలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రైలు ప్రయాణాల్లో వ్యక్తిగత సౌకర్యంతో పాటు తోటి ప్రయాణికుల సదుపాయాన్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us