Andhra Pradesh: బార్ల లైసెన్సులకు గడువు పెంపు.. కొత్త నిర్ణయంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కొత్త మద్యం పాలసీ తీసుకువస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో బార్ల లైసెన్స్ కాలపరిమితి ముగియాల్సి ఉండగా.. ఆ గడువును ఆగస్టు 31 వరకు పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

Andhra Pradesh: బార్ల లైసెన్సులకు గడువు పెంపు.. కొత్త నిర్ణయంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు
wines

Updated on: Jun 18, 2022 | 8:05 AM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కొత్త మద్యం పాలసీ తీసుకువస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో బార్ల లైసెన్స్ కాలపరిమితి ముగియాల్సి ఉండగా.. ఆ గడువును ఆగస్టు 31 వరకు పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ(Rajat Bhargava) ఉత్తర్వులిచ్చారు. సీఎం జగన్(CM Jagan) హామీ ఇచ్చినట్లు 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం కావాలంటే… కొత్త బార్ల విధానమే అవసరం లేదు. ఇచ్చినప్పటికీ.. ఏడాది కాలపరిమితితో ఇవ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా మూడేళ్ల కాలపరిమితితో బార్ల విధానాన్ని ఖరారు చేశారు. ఆ కాలానికే లైసెన్సు రుసుములు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను వసూలు చేయనున్నారు. తాజా విధానం ప్రకారం.. నగరపాలక, మునిసిపాలిటీల పరిధిలో నోటిఫై చేసిన బార్లన్నింటికీ లైసెన్సుల జారీ కోసం అప్లికేషన్లు తీసుకుంటారు. అధికంగా నగదు కోట్‌ చేసిన వారికి లైసెన్స్ ఇస్తారు. దరఖాస్తు రుసుము కింద 50వేల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో 5 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 7.5 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ సొమ్మును తిరిగి చెల్లించరు.

త్రీస్టార్‌ అంతకంటే పైస్థాయి హోటళ్లు, మైక్రో బ్రూవరీస్‌లోని బార్లకు రిజిస్ట్రేషన్‌, లైసెన్సు రుసుము కలిపి ఏడాదికి 55 లక్షలుగా నిర్ణయించారు. ఏటా 10శాతం మేర పెంచుతారు. నగరపాలక సంస్థల్లో 10 కిలోమీటర్లు, మున్సిపాలిటీల్లో 3 కిలోమీటర్లు పరిధిలో బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కాగా.. 2019లో 40% బార్లను తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎందుకు తగ్గించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us