AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!

Nellore: ఐటీ రంగాన్ని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరింప చేయాలన్న ఉద్దేశంతో తన మిత్రులకి చెందిన వివిధ సంస్థలు నెల్లూరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. టెర్రాలజిక్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ప్రపంచమంతా బ్రాంచ్‌లున్నాయి. ఐదు దేశాలలో 13 కార్యాలయాలతో పాటు భారత దేశంలో బెంగుళూరు..

Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!
Nellore
Ch Murali
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 9:32 AM

Share

Nellore: ఏపీలో నంబర్ వన్ ఇండస్ట్రియల్ హబ్ గా ఉన్న నెల్లూరు ఐటి హబ్‌గా మారుతోంది. ఐటికి అనువైన నగరంగా గుర్తించి సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు సంస్థలు నెల్లూర్‌లో కార్యకలాపాలు చేస్తుండగా కొత్తగా మరో 9 సంస్థలు నెల్లూరుకు వచ్చాయి. నెల్లూరుతో పాటు ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల యువతకు ఉపాధి మార్గంగా నెల్లూరు మారనుంది. తొలి దశలో వెయ్యి ఐటి జాబ్స్ రానున్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో నెల్లూరులో ఐటి ఇన్నొవేషన్ హబ్ మాతృభూమిపై మమకారంతో సాఫ్ట్ వేర్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు టెర్రాలాజిక్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అధినేత రెనిల్ కొమిట్ల. ఐటి రంగంలో ఉద్యోగాలు ఐటీ ఇన్నోవేషన్ ఉద్యమాలు నోయిడా, ముంబై, పుణే, బెంగళూరు. హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకే ఎందుకు పరిమితం కావాలి.. తాను పుట్టిన నెల్లూరులో ఎందుకు ఐటీ కంపెనీ పెట్టకూడదని, అలాగే సొంత గడ్డప యువతకు ఎందుకు ఐటీ ఉద్యోగాలు కల్పించకూడదు అని ఆలోచన చేసి ఆ ఆలోచనను అమలు చేసి నేడు నెల్లూరులో వందలాది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను సృష్టించాడు టెక్ దిగ్గజం టెర్రాలజిక్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అధినేత రెనిల్ కొమిట్ల.

ఐటీ రంగాన్ని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరింప చేయాలన్న ఉద్దేశంతో తన మిత్రులకి చెందిన వివిధ సంస్థలు నెల్లూరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. టెర్రాలజిక్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ప్రపంచమంతా బ్రాంచ్‌లున్నాయి. ఐదు దేశాలలో 13 కార్యాలయాలతో పాటు భారత దేశంలో బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై. పుణెలలో బ్రాంచ్‌లున్నాయి. వీటి ద్వారా వేలాది మంది ఉద్యోగాలు పొందుతున్నారు. అయినా ఇవేవీ ఇవ్వలేని ఆత్మసంతృప్తి 2022లో నెల్లూరులో ఏర్పాటు చేసిన బ్రాంచ్ ద్వారా లభించింది. నెల్లూరులోనే కొద్ది నెలల్లోనే 150 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకుంది. పదికి పైగా సంస్థల్లో వెయ్యి ఉద్యోగాలు టార్గెట్ గా సంస్థలు పనిచేయనున్నట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. భారత దేశంలోనే నెల్లూరు లాంటి టైర్ 2 వంటి నగరంలో ఐటీ జాబ్స్ అంటే ఐటి సంస్థలు సాహసం చేస్తున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ కంపెనీలకు కూడా కలిసొచ్చే అంశం కూడా ఉంది. మెట్రో పాలిటన్ సిటీతో పోల్చితే కాస్ట్ తగ్గుతుంది. ఇక్కడ ఉన్న వారికి జీతం తక్కువైనా సొంత ఊరిలో ఐటి జాబ్ అనుకూలంగా ఉంటుంది.

అమెరికా గవర్నమెంట్ సేవలో నెల్లూరు సాఫ్ట్‌వేర్‌

నెల్లూరులో ఏర్పాటైన ఐటి సంస్థల్లో డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా అమెరికన్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసం వాడుతున్నారు. లాలీపాప్ డిజైన్ స్టూడియో, భారతదేశంలోని ప్రముఖ UI/UX, ప్రొడక్ట్ డిజైన్ సంస్థలలో ఒకటైన లాలీపాప్ డిజైన్ స్టూడియో, 15కు పైగా దేశాల్లోని ఎంటర్‌ప్రైజ్ క్లయింట్లకు సేవలు అందిస్తోంది. నెక్సస్ ఇన్నోవేషన్ హబ్‌లో డిజైన్ కార్యకలాపాలను ప్రారంభించిన లాలీపాప్, నెల్లూరులోని డిజైన్ ప్రతిభకు మెట్రో నగరాలకు వెళ్లకుండా ప్రపంచ స్థాయి బ్రాండ్లతో పనిచేసే అవకాశాన్ని అందిస్తోంది. కారామెలోస్టూడియో ఒక క్రియేటివ్, మార్కెటింగ్ టెక్నాలజీ కంపెనీ. బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ ప్రొడక్షన్, క్యాంపెయిన్లు, అనలిటిక్స్‌ను ఒకే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌గా తీసుకువచ్చి బ్రాండ్లకు సేవలు అందిస్తోంది. భారతదేశం, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారామెలో వ్యాపారాలు తమ బ్రాండ్‌ను మరింత మందికి చేరవేయడానికి, మార్కెట్‌లో బలమైన గుర్తింపు పొందడానికి సహాయపడుతోంది. క్లయింట్ల అవసరాలను అర్థం చేసుకుని, నాణ్యమైన సేవలను అందించడం కారామెలో ప్రత్యేకత.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!
ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!
స్టార్ బ్యాటర్ గుర్బాజ్ తలపై క్యాప్ ఎత్తుకెళ్లిన క్రేజీ ఫ్యాన్
స్టార్ బ్యాటర్ గుర్బాజ్ తలపై క్యాప్ ఎత్తుకెళ్లిన క్రేజీ ఫ్యాన్
వచ్చే 5 నెలలు వీరికి మోత మోగిపోతాది.. నిర్లక్ష్యం చేస్తే కష్టాలే
వచ్చే 5 నెలలు వీరికి మోత మోగిపోతాది.. నిర్లక్ష్యం చేస్తే కష్టాలే
ఫెయిల్యూర్ అయిన ప్రేమ చితి మీద కూడా బతికే ఉంటుంది..
ఫెయిల్యూర్ అయిన ప్రేమ చితి మీద కూడా బతికే ఉంటుంది..
నాకు నచ్చని సినిమా అదే.. ఎన్టీఆర్‏తో అలా చేయకుండా ఉండాల్సింది..
నాకు నచ్చని సినిమా అదే.. ఎన్టీఆర్‏తో అలా చేయకుండా ఉండాల్సింది..
టాక్సిక్‌కు వాళ్లతో అస్సలు అవసరం లేదా..?
టాక్సిక్‌కు వాళ్లతో అస్సలు అవసరం లేదా..?
మీ బెడ్‌రూమ్‌లో ఈ మొక్క ఉంటే చాలు.. ఆరోగ్యం,ప్రశాంతత మీ సొంతం!
మీ బెడ్‌రూమ్‌లో ఈ మొక్క ఉంటే చాలు.. ఆరోగ్యం,ప్రశాంతత మీ సొంతం!
తక్కువ ధరల్లోనే ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లు.. ప్రయోజనాలు ఏంటి?
తక్కువ ధరల్లోనే ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లు.. ప్రయోజనాలు ఏంటి?
సాక్షి రంగరావు కొడుకు బుల్లితెరపై తోపు నటుడు..
సాక్షి రంగరావు కొడుకు బుల్లితెరపై తోపు నటుడు..
ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలీదంటే ఇదేనేమో..
ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలీదంటే ఇదేనేమో..