AP Cinema ticket prices : ‘సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు’.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఆయన వైసీపీ ఎమ్మెల్యే. పేరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ఒక్కోసారి స్వపక్షంలో విపక్షంలా మారతారు.

AP Cinema ticket prices : సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Mla Nallapureddy

Updated on: Jan 10, 2022 | 2:50 PM

ఆయన వైసీపీ ఎమ్మెల్యే. పేరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ఒక్కోసారి స్వపక్షంలో విపక్షంలా మారతారు. అధికారులు పనులు చేయడం లేదంటూ బాహాటంగానే వ్యాఖ్యానిస్తారు. న్యూస్ లో ఎప్పుడు కనిపించినా ఆయన మార్క్ ఉంటుంది. తాజాగా సినిమా వాళ్లపై చెలరేగిపోయారు ప్రసన్నకుమార్ రెడ్డి. టికెట్ల ధరలు తగ్గిస్తే తప్పేంటని ప్రశ్నించారు. హీరోలందరూ కోట్లు సంపాదిస్తున్నారని.. విలాసంగా బ్రతుకుతున్నారని వ్యాఖ్యానించారు. పేదవాడు హాలుకు పోయి టికెట్ కొనే స్థితి లేదని.. అందుకే మార్పు తీసుకొచ్చినట్లు చెప్పారు. అసలు ఏపీ అనేది ఒకటి ఉంది.. ఇక్కడ సీఎం జగన్ ఉన్నాడని.. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నటులకు గుర్తుందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు  నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. సినిమావాళ్లకు బలిసిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూర్చుని.. అక్కడ మూవీస్ చేసుకుంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రశ్నించారు. సినిమా వాళ్లకి చంద్రబాబు సపోర్ట్ ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Also Read: పాపం కాలు విరిగింది కట్టు వేస్తున్నారు అనుకునేరు.. అసలు విషయం తెలిసి అధికారులే షాక్

ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్