AP Crime News: నెల్లూరు జిల్లాలో దారుణం! 9వ తరగతి బాలిక నోట్లో యాసిడ్‌ పోసి, గొంతుకోసి.. ఆపై..

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక పెద్దగా అరవడంతో..

AP Crime News: నెల్లూరు జిల్లాలో దారుణం! 9వ తరగతి బాలిక నోట్లో యాసిడ్‌ పోసి, గొంతుకోసి.. ఆపై..
Acid Attack

Updated on: Sep 06, 2022 | 9:26 AM

Acid attack on 9th class student: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక పెద్దగా అరవడంతో నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోసి, ఆపై గొంతు కోసి పరారయ్యాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..

బాధిత బాలిక నెల్లూరులో ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక కుటుంబ సభ్యులు సోమవారం (సెప్టెంబర్‌ 5) సాయంత్రం బయటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన నింధితుడు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. భయాందోళనలకు గురైన బాలిక బాత్రూంలోకెళ్లి తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. ఈలోగ నాగరాజు తలుపులు బలంగా తోసి లోపలికి ప్రవేశించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన బాలిక నోట్లో, ముఖంపై నిందితుడు యాసిడ్‌ పోశాడు. యాసిడ్‌ వల్ల కలిగిన బాధ తట్టుకోలేక బాలిక కేకలు వేయటంతో నిందితుడు కత్తితో గొంతు కోసి బయటికి పరుగులు తీశాడు. స్థానికులు వచ్చిచూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కామాంధుడు నాగరాజును అరెస్టు చేశారు. పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us