Nellore: నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ కేసు.. సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదన్న ఏజీ..

|

Apr 26, 2022 | 1:02 PM

Nellore Court Documents Theft Case: ఏపీలోని నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Nellore: నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ కేసు.. సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదన్న ఏజీ..
Ap High Court
Follow us on

Nellore Court Documents Theft Case: ఏపీలోని నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదన్న నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా.. హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరిపింది. కాగా.. ఈ కేసులో సీఎస్‌, డీజీపీ, జిల్లా జడ్జి, మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి సహా 18మందిని ప్రతివాదులుగా ఉన్నారు. కాగా.. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) కోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ డైరెక్టర్‌, డీజీపీ, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలంటూ డీజీపీని సైతం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ హైకోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేస్తూ ఏపీ హై కోర్టు నిర్ణయం తీసుకుంది.

కాగా.. ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివేదిక ఇవ్వడంతో.. హైకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. దీనిలో బెంచ్‌ క్లర్క్‌ సహా 18 మందిని ప్రతివాదులుగా చేర్చారు.

Also Read:

Nellore Court Theft: నెల్లూరు కోర్టు చోరీ కేసు మరో కీలక మలుపు.. దర్యాప్తులో లోపాలున్నాయన్న పీడీజే..

Tirupati: అయ్యయ్యో.. రుయా..! కుమారుడి మృతదేహాన్ని బైక్‌పై 90 కి.మి తీసుకెళ్లిన తండ్రి