Watch: హై స్పీడ్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు.. నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం!

Nellore Accident: నెల్లూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మంగళవారం నగరంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్‌తో వెళ్తున్న ఓ కంటైనర్ లారీ ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారి పక్కనున్న దుకాణాలపై దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Watch: హై స్పీడ్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు.. నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం!
Nellore Accident

Updated on: Nov 11, 2025 | 6:44 PM

నెల్లూరులో లారీ బీభత్సానికి ముగ్గురి ప్రాణాలు పోయాయి. మరో ముగ్గురు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. NTR నగర్‌ దగ్గర జాతీయ రహదారిపై చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ.. అతి వేగంతో అదుపుతప్పి ఓ ఆటోను, కొన్ని బైక్‌లను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్న వ్యక్తి పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. మరికొందరు ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికుల వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంలో అందుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని తొలుత హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అలాగే రోడ్డుకు అడ్డంగా పడపోయిన వాహనాలను తొలగించింది. ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డైయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతివేగం కారణంగా తరచూ ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్న వాహనాలు నడిపేవారిలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఇలా రోజూ ఏదో ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలను నివారించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.