NABARD – Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

|

Jan 22, 2022 | 10:26 AM

NABARD - Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా వరం లాంటి వార్త. ఆసుపత్రుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు..

NABARD - Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు..!
Follow us on

NABARD – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా వరం లాంటి వార్త. ఆసుపత్రుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.1392.23 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్). సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఇతర రాష్ట్రాలకు చికిత్స కోసం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త. అయితే, నాబార్డ్ విడుదల చేసిన నిధులతో వైఎస్ఆర్ కడప, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కొత్తగా నిర్మించబోయే ఆస్పత్రుల్లో ప్రధాన ఆపరేషన్ థియేటర్లు, క్లినికల్ ఔట్ పేషెంట్ విభాగాలు (OPDలు), డయాలసిస్, బర్న్ వార్డులు, క్యాజువాలిటీ వార్డులు, ప్రత్యేకమైన క్లినికల్-కమ్-సర్జికల్ వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు.

అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ రూమ్‌లు, ఆయుష్ క్లినిక్, ట్రీట్‌మెంట్ ప్రొసీజర్ రూమ్‌లు, డయాలసిస్ వార్డులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్ (ఓటీ) కాంప్లెక్స్, ఓపీడీ, సాధారణ/పీడియాట్రిక్/ఆర్థోపెడిక్ వార్డులు మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు.

ఇదిలాఉంటే.. గో ఏపీ ఫ్లాగ్‌షిప్ నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాల ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రూ.3,092 కోట్లు మంజూరు చేసింది నాబార్డ్. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. దాదాపు 25,648 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు, డయాలసిస్ వార్డులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఓటీ కాంప్లెక్స్‌లు, OPDలు, జనరల్/పీడియాట్రిక్/ఆర్థోపెడిక్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు.

Also read: