Nara Lokesh Tweet: ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు: మండిపడ్డ నారా లోకేష్‌

|

Jan 20, 2021 | 2:49 PM

Nara Lokesh Tweet: ఏపీలో రైతుల ఆత్మహత్యలపై టీటీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రైతు ఆత్మహత్యల విషయంలో..

Nara Lokesh Tweet: ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు: మండిపడ్డ నారా లోకేష్‌
Follow us on

Nara Lokesh Tweet: ఏపీలో రైతుల ఆత్మహత్యలపై టీటీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రైతు ఆత్మహత్యల విషయంలో లోకేష్‌ సీఎం జగన్‌పై ఆరోపణలు చేశారు. జగన్‌ రైతు వ్యతిరేక విధానాలతో 753 మంది రైతులు బలయ్యారని ఆయన ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అప్పులపాలైన ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ఆరోపించారు. ఇన్సూరెన్స్‌ నుంచి మద్దతు ధర వరకు సీఎం జగన్‌ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

చందర్లపాడులో కౌలు రైతు లక్ష్మీనారాయణ ఆత్మహత్య చాలా బాధాకరమని అన్నారు. అప్పుల బాధ భరించలేక పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. అలాగే ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీనారాయణ కౌలు రైతుల కష్టాలు వివరిస్తూ లేఖ రాసి చనిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మోసపూరిత ప్రకటనలు వీడి రైతులను ఆదుకోవాలని ఆయన ట్వీట్‌ చేశారు.