Nara Lokesh: నెట్టింట వైరల్ అవుతోన్న లోకేష్‌ సెల్ఫీ.. ఇంతకీ ఈ ఫొటో ఉద్దేశం ఏంటో మీకు తెలుసా.?

|

Feb 14, 2023 | 12:50 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13వ తేదీ నగరి నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర జరిగింది. ఇక లోకేష్ తన పాదయాత్రకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు..

Nara Lokesh: నెట్టింట వైరల్ అవుతోన్న లోకేష్‌ సెల్ఫీ.. ఇంతకీ ఈ ఫొటో ఉద్దేశం ఏంటో మీకు తెలుసా.?
Nara Lokesh
Follow us on

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13వ తేదీ నగరి నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర జరిగింది. ఇక లోకేష్ తన పాదయాత్రకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సీరియస్‌గా విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు సెటైరికల్‌ జోక్స్‌ సైతం వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నారా లోకేష్‌కు సంబంధించిన ఓ సెల్ఫీ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పాద యాత్రలో భాగంగా ఓ హోటల్‌ని చూపిస్తూ దిగిన సెల్ఫీ ఫొటోను టీడీపీ నాయకులు తెగ వైరల్‌ చేస్తున్నారు.

సదరు హోటల్‌పై పబ్జీ అని రాసి ఉంది. దీంతో అసలు లోకేష్‌ ఈ సెల్ఫీ ఎందుకు తీసుకున్నాడన్న దానిపై నెట్టింట చర్చ మెదలైంది. ఈ ఫొటోను టీడీపీ క్యాడర్‌ తెగ వైరల్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే అసలు లోకేష్‌ ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. పబ్‌జీ సీఎం, పబ్‌జీ హోటల్‌ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. గతంలో టీడీపీ ఏపీ సీఎమ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పబ్జీ సీఎమ్‌ అంటూ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకేష్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేసినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. నారా లోకేష్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తే.. వైసీపీ రివర్స్‌ అటాక్‌ చేసింది. అసలు ఆ జోక్‌ ఏంటో చెబితే మేము కూడా నవ్వుతాం అంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..