కర్నూల్, జూన్ 21: నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోటేష్ అనే చిత్రకారుడు వేసిన అద్భుత చిత్రాలు అందరిని కట్టిపడేస్తున్నాయి. కోడిగుడ్డుపై వివిధ రకాల యోగాసనాలు కళ్ళకు కట్టినట్లుగా చిత్రించడం అద్భుతంగా చూస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు. నేషనల్ యోగా డే సందర్భంగా నంద్యాల జిల్లా చిత్రకారుడు కోటేష్ వేసిన వినూత్నమైన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. కోడిగుడ్డుపై మైక్రో బ్రష్ సహాయంతో యోగాసనాలలో ముఖ్యమైన 60 యోగా అసనాలను అద్భుతంగా చిత్రీకరించారు చిత్రకారుడు కోటేష్. దాదాపు రెండు గంటల సమయంలో ఎంతో శ్రమకోర్చి అద్బతంగా యోగాసనాల చిత్రాలు వెయ్యడం పలువురి ప్రశంసల అందుకున్నారు.
ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ.. యోగా చెయ్యడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు ఒత్తిడి తగ్గి ఎంతో ఆరోగ్యవంతమైన జీవితంకు యోగా ఉపయోగపడుతుందన్నారు. పూర్వం యోగులు, బుషులు యోగా, ధ్యానం ద్వారా తమ ఆయుష్షు పెంచుకున్నారంటు గుర్తు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.