Andhra News: వారెవ్వా.. ఇంటి మధ్యలో కొబ్బరి చెట్టు.. ఎంత అద్భుతంగా ఉందో.. ఇదిగో వీడియో

నేచర్ అంటే అతనికి మహా ఇష్టం.. అందులోనూ చెట్లు అంటే ఇంకా ప్రాణం.. ఎంతగా అంటే.. ఇల్లు కట్టుకునేందుకు అడ్డుగా ఉన్న చెట్టును తొలగించలేదు. చెట్టును లోపల అలాగే ఉంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ చెట్టు ఇంటికంటే హైట్ ఎక్కువగా ఉంది. అసలు ఇంటిపై కొబ్బరి చెట్టు నాటినారా? అన్నట్లు ఉంది..

Andhra News: వారెవ్వా.. ఇంటి మధ్యలో కొబ్బరి చెట్టు.. ఎంత అద్భుతంగా ఉందో.. ఇదిగో వీడియో
Coconut Tree House

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 08, 2025 | 12:58 PM

నేచర్ అంటే అతనికి మహా ఇష్టం.. అందులోనూ చెట్లు అంటే ఇంకా ప్రాణం.. ఎంతగా అంటే.. ఇల్లు కట్టుకునేందుకు అడ్డుగా ఉన్న చెట్టును తొలగించలేదు. చెట్టును లోపల అలాగే ఉంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ చెట్టు ఇంటికంటే హైట్ ఎక్కువగా ఉంది. అసలు ఇంటిపై కొబ్బరి చెట్టు నాటినారా? అనే విధంగా ఆ దృశ్యం అందరినీ కట్టి పడేస్తోంది.. ఇంతకు ఇది ఎక్కడో తెలుసుకోవడాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. నంద్యాల జిల్లా బేతంచెర్ల కోటపేటలో ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.. బేతంచెర్ల కోటపేటకు చెందిన నాపరాయి పరిశ్రమ యజమాని రహిమాన్ ఇంట్లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.. రహిమాన్ కు చెట్లు అంటే మహా ఇష్టం. శిథిలావస్థకు చేరుకున్న ఇంటిని రెండేళ్ల క్రితం తొలగించి ఆ స్థానంలో కొత్త ఇల్లు నిర్మించాడు.. అప్పటికే ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్టు ఇంటి నిర్మాణానికి అడ్డు వచ్చింది. దీంతో అందరూ తీయాలని సూచించారు.. కానీ.. అతను వినలేదు.. ఆ కొబ్బరి చెట్టును తొలగించకుండా ఇంటిని నిర్మించాడు.

సరిగ్గా ఇంటికి మధ్యలో ఉన్న ఈ చెట్టు.. ప్రస్తుతం ఏపుగా పెరిగి ఇంటికంటే ఎత్తులో అందరినీ ఆకట్టుకుంటోంది.. బయటివారు చూసేందుకు ఇంటిపైనే కొబ్బరి చెట్టు నాటినారా అనే విధంగా కనిపిస్తోంది.

వీడియో చూడండి..

కొందరు దీన్ని చూసి.. అద్భుతం అంటూ రహిమాన్ ను అభినందిస్తున్నారట.. ఎక్కడ చూసినా గ్రీనరీ ని నాశనం చేస్తున్న నేటి పరిస్థితులలో.. ఇంటిలోనే చెట్టును పెంచుకుంటున్న రహిమాన్ నిజంగా ఆదర్శప్రాయుడంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..