Andhra Pradesh: ఏపీలో పేరు మార్పు వివాదం.. హిందువులకు వ్యతిరేకంగా వైసీపీ పోకడలంటూ సోము వీర్రాజు మండిపాటు

|

May 04, 2023 | 12:21 PM

ఆనంద త్రిదండి అగ్రహారంలోని రెండు లైన్ కు ఫాతిమా నగర్ అంటూ బోర్డులను కార్పోరేషన్ సిబ్బంది ఏర్పాటు చేసింది. దీంతో ఫాతిమా నగర్ అంటూ బోర్డు పెట్టడంపై స్థానికుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మున్సిపల్ సిబ్బంది పేరు మారుస్తూ ఏర్పాటు చేసిన బోర్డుని సిబ్బంది తొలగించలేదు.  

Andhra Pradesh: ఏపీలో పేరు మార్పు వివాదం.. హిందువులకు వ్యతిరేకంగా వైసీపీ పోకడలంటూ సోము వీర్రాజు మండిపాటు
Name Change Controversy
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో మున్సిపల్ అధికారులు ఓ వార్డ్ లైన్స్ పేరుని మార్చి వివాదానికి ఆజ్యం పోసింది. నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ట్రెండు లైన్స్  ఏటి అగ్రహారం పేరుని మార్చి సరికొత్త పేరుతో బోర్డుని ఏర్పాటు చేసింది. ఆనంద త్రిదండి అగ్రహారంలోని రెండు లైన్ కు ఫాతిమా నగర్ అంటూ బోర్డులను కార్పోరేషన్ సిబ్బంది ఏర్పాటు చేసింది. దీంతో ఫాతిమా నగర్ అంటూ బోర్డు పెట్టడంపై స్థానికుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మున్సిపల్ సిబ్బంది పేరు మారుస్తూ ఏర్పాటు చేసిన బోర్డుని సిబ్బంది తొలగించలేదు.

దీంతో స్థానిక యువకులు రంగంలోకి దిగి.. ఫాతిమా నగర్ నేమ్ బోర్డు చింపివేసి ఏటి అగ్రహారం అంటూ  మళ్ళీ తమ లైన్స్ కు పూర్వపు పేరుతో బోర్డుని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. అంతేకాదు మరోవైపు శ్రీ రామ్ నగర్ ను చైతన్య నగర్ గా మార్చారు. ఇదే విషయంపై స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పేరు మార్పు పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రికి రాత్రే మార్చేస్తూ.. ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అంటూ ప్రశ్నించారు. అంతేకాదు విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరు లో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం ఈ తరహా సంఘటనలుకు ఎవరు సూత్రధారి అని సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు ఎందుకు ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారని మండి పడ్డారు.  అదే విధంగా హిందూ ఎస్సీ లకు వ్యతిరేకంగా యున్న ప్రభుత్వ పోకడలు చూస్తే హిందువుల పై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..