AP Municipal Elections: వైసీపీ ఘన విజయం.. సొంతపార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా..

|

Mar 14, 2021 | 2:06 PM

AP Municipal Election Results 2021: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి..

AP Municipal Elections: వైసీపీ ఘన విజయం.. సొంతపార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా..
MlLA Roja
Follow us on

AP Municipal Election Results 2021: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు, నగరి మున్సిపాలిటీలను వైసీపీ చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన రోజా.. ప్రత్యర్థులను మున్సిపల్ ఆఫీస్ గేట్ కూడా తాకనివ్వనని అన్నారు. పార్టీలో ఉంటూనే సొంత పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వాళ్లను తొక్కిపారేశానని వ్యాఖ్యానించారు. బాలయ్య రీల్ హీరో అయితే.. జగన్ రియల్ హీరో అని కామెంట్ చేశారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఆఖరికి సొంత పార్టీలోని రెబల్స్ అయినా జగన్ ఫాలోయింగ్ ముందు కొట్టుకుపోవాల్సిందేనని రోజా వ్యాఖ్యానించారు. జగన్‌ను, ఆయన పార్టీని, ఆయన అజెండాను అవమానించే ఏవరైనా సరే తమ పార్టీలో మనుగడ సాగించలేరంటూ సొంత పార్టీలోని రెబల్స్‌ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన చీడపురుగులను సీఎం జగన్ ఏరిపారేయాల్సిన అవశ్యకత ఉందని ఎమ్మెల్యే రోజా ఉద్ఘాటించారు. వారిపట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తే మాత్రం చాలా ప్రమాదం అని అన్నారు. జగన్ పట్ల ప్రజల్లో ఎంతో ప్రేమ ఉందని, నాయకులకు ప్రజల పట్ల కమిట్‌మెంట్ ఉందన్న రోజా.. ఇలాంటి చీడ పురుగుల వల్ల పార్టీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. పుత్తూరులో విత్‌డ్రా చేసుకున్నట్లే చేసుకుని అంతర్గత రాజకీయాలు నిర్వహించారని, ఇక నగరిలో మాత్రం ఓపెన్‌గా రెబల్‌ని బరిలోకి దింపారంటూ వైసీపీ రెబల్స్‌పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. అయితే ప్రజలు మాత్రం వారికి బుద్ధి చెప్పి.. నిజమైన వైసీపీ నాయకులకు, నిజమైన పార్టీ కార్యకర్తలకు పట్టం కట్టారని అన్నారు. ఈ విజయం జగన్ పరిపాలనకు గిఫ్ట్‌గా భావిస్తున్నామని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున కూడా ఎమ్మెల్యే రోజా సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలు తనను వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కావాలని రెబల్స్‌ని నిలబెట్టి తనను, వైసీపీని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలే పుట్టి ముంచడంపై హైకమాండ్‌కి ఫిర్యాదు చేస్తానని రోజా అన్నారు.

Also read: Hindupuram Election Results: హిందూపురంలో అనూహ్య పరిణామం.. వైసీపీ, టీడీపీకి పోటీగా దూసుకొచ్చిన మరో పార్టీ..

Telangana, AP MLC Elections 2021 Live : తెలుగురాష్ట్రాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్

AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా