సీఎం జగన్‌ను కలిసిన వచ్చిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్టయిల్ మార్చారు. రాజకీయంగా తానిక స్లో అవుతానని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయనే ముఖ్యమంత్రితో భేటీ తర్వాత గేర్ మార్చారు. సీఎం నుంచి వచ్చిన హామీతోనో ఏమో కానీ దూకూడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు కృష్ణప్రసాద్. ఆయనకు, మంత్రి జోగి రమేష్‌కు మధ్య మైలవరంలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఇరు నేతల అనుచరులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో సీఎంవో దగ్గర పంచాయితీ నడిచింది. అయినా పరిస్థితి మారకపోవడంతో గురువారం సీఎం జగన్‌తోనే చర్చించారు కృష్ణప్రసాద్. మైలవరం పార్టీలో విభేదాలపై మాట్లాడారు.
పార్టీ మారే ప్రసక్తే లేదని, జీవితాంతం జగన్‌తోనే ఉంటానని ప్రకటించారు కృష్ణప్రసాద్. సీఎంతో భేటీ తర్వాత వాయిస్ కూడా పెంచారు ఎమ్మెల్యే. తాను వార్నింగ్ ఇవ్వను అంటూనే మంత్రి జోగి రమేష్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు వసంత కృష్ణప్రసాద్. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెబుతున్న వసంత కృష్ణప్రసాద్ మరో రెండు మూడు రోజుల్లో సీఎంవోలో జోగి రమేష్‌తోనే కూర్చుని సమస్యల్ని పరిష్కరించుకుంటామని ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి