AP News: మైలవరంలో మలుపు తిరిగిన రాజకీయం.. వసంత రూటు ఎటు?

|

Feb 08, 2024 | 10:00 AM

మైలవరం రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. వైసీపీని వీడిన వసంత కృష్ణ ప్రసాద్‌ రూట్ ఎటు? కాంగ్రెస్‌లోకా జనసేనలోకా.. లేదంటే సైకిల్ ఎక్కుతారా? పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డ వసంతపై తెలుగు తమ్ముళ్లు మాత్రం భగ్గుమంటున్నారు. ఇంతకీ ఆయనేం చేశారు? టీడీపీ కేడర్ ఆగ్రహానికి కారణాలేంటి? కృష్ణా జిల్లా మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

AP News: మైలవరంలో మలుపు తిరిగిన రాజకీయం.. వసంత రూటు ఎటు?
Mla Vasanta Krishna
Follow us on

మైలవరం రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. వైసీపీని వీడిన వసంత కృష్ణ ప్రసాద్‌ రూట్ ఎటు? కాంగ్రెస్‌లోకా జనసేనలోకా.. లేదంటే సైకిల్ ఎక్కుతారా? పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డ వసంతపై తెలుగు తమ్ముళ్లు మాత్రం భగ్గుమంటున్నారు. ఇంతకీ ఆయనేం చేశారు? టీడీపీ కేడర్ ఆగ్రహానికి కారణాలేంటి? కృష్ణా జిల్లా మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో సీఎం జగన్ మైలవరం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు మరొకరికి అప్పగించారు. దీంతో వసంత వైసీపీని వీడారు. ఇప్పుడాయన ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది.

వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన వసంత.. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. వసంత నాగేశ్వరరావు మాత్రం కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరారని క్లారిటీ ఇచ్చారు. నందిగామ జనసేన ఇన్‌ఛార్జ్‌తో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకుల వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మైలవరం తెలుగు తమ్ముళ్లు సమావేశమయ్యారు. వసంత టీడీపీలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. అసలు టీడీపీ నుంచి ఎవరు ఆహ్వానించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 400మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించిన వసంత ఎలా సైకిల్ ఎక్కుతారని నిలదీశారు. డబ్బుతో ఎవరినైనా కొనొచ్చు.. టీడీపీ కార్యకర్తల్ని మాత్రం ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు.

వసంతకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానాలు అందాయా? టీడీపీలో చేరారన్న నాగేశ్వరరావు మాటల్లో నిజమెంత? టీడీపీ కేడర్‌ వ్యతిరేకిస్తుండటంతో ఆయన డైలమాలో పడ్డారా? ఇంతకీ వసంత పొలిటికల్ పయనం ఎటువైపు? ఏ నియోజకవర్గం నుంచి? ఇప్పుడివే ప్రశ్నలు మైలవరంలో హాట్‌హాట్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..