Uravakonda: మటన్ రేటు విషయంలో మాటా.. మాటా పెరిగింది.. ఆపై కత్తి వేటు పడింది… నిండు ప్రాణం పోయింది

మటన్‌ మార్కెట్‌లో మర్డర్‌. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇద్దరు వ్యాపారుల మధ్య జరిగిన చిల్లర గొడవ చినికి చినికి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

Uravakonda: మటన్ రేటు విషయంలో మాటా.. మాటా పెరిగింది.. ఆపై కత్తి వేటు పడింది... నిండు ప్రాణం పోయింది
Mutton Shop

Updated on: Sep 05, 2022 | 8:32 PM

Andhra Pradesh: నడుస్తూ అంబులెన్స్‌లోకి… ఆయన ధైర్యాన్ని చూసి కోలుకొని క్షేమంగా తిరిగి వస్తాడని భావించరంతా. కానీ చివరకు విషాద వార్త.. చికిత్స పొందుతు సునీల్‌ చనిపోవడం అందర్నీ కలిచి వేసింది. మరోవైపు మటన్‌ మార్కెట్‌లో విధ్వంసం అనంతపురం జిల్లా(Anantapur district) ఉరవకొండలో అలజడి రేపింది.నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బంధువులు, స్నేహితులు, స్థానికులు పీఎస్‌ఎదుట ఆందోళనకు దిగారు. మటన్‌ రేటు విషయంలో తలెత్తిన గొడవే చినికి చినికి దాడికి దారి తీసింది. ఒకరు మటన్‌ కేజీ 650 రూపాయిలకు అమ్మితే మరొకరు 6వందలకే విక్రయించడంపై వివాదం రాజుకుంది. చూస్తుండగానే మాటా మాటా పెరిగి దాడి జరిగిందన్నారు ప్రత్యక్ష సాక్షులు. పోలీసులు అదే నిర్ధారించారు. ధర విషయంలో జరిగిన గొడవే దాడికి కారణమన్నారు పదునైన ఆయుధంతో దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతో సునీల్‌ చనిపోయాడన్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకొని హత్యాయత్నం కేసును మర్డర్‌గా మార్చారు. ఒకరి క్షణికావేశం ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. . సునీల్‌కు ఏడాది కిందటే పెళ్లయింది. మూడు నెలల కూతురు వుంది. కుటుంబసభ్యుల ఆవేదనను చూస్తే రాతి గుండె కూడా కన్నీరవక తప్పదు.

తీవ్ర గాయాలైనప్పటికీ సునీల్‌ ఎంతో ధైర్యంగా కన్పించారు. ఆయన కోలుకుంటారని భావించారంతా. కానీ దారుణం జరిగింది. పాత కక్షల్లేవు..పగల్లేవు. కానీ క్షణికావేశం.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.మరోవైపు హంతకుడిగా ఒన్నుస్వామి జైలుబాటపట్టాడు. క్షణికావేశం చివరకు మిగిలేది అనర్ధమే..అందుకు ఈ ఘటన నిదర్శనమే. సునీల్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఉరవకొండ వాసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..