AP News: ఇదెక్కడి సర్జరీ రా మావా..!

మ్యూజిక్, పాటలు వినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కొన్ని వింతైనా సంఘటనలు కూడా చూసి ఉంటాం.. మ్యూజిక్ కొందరి ప్రాణాలకు రక్షించినట్లు, మ్యూజిక్ లేదా పాటను వింటూ ఆపరేషన్ చేసినట్లు విని ఉంటాం. తాజాగా అలాంటి సంఘటనే ఒక్కటి జరిగింది.

AP News: ఇదెక్కడి సర్జరీ రా మావా..!
Spb Songs And Brain Surgery
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 10, 2024 | 9:31 PM

మ్యూజిక్, పాటలు వినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కొన్ని వింతైనా సంఘటనలు కూడా చూసి ఉంటాం.. మ్యూజిక్ కొందరి ప్రాణాలకు రక్షించినట్లు, మ్యూజిక్ లేదా పాటను వింటూ ఆపరేషన్ చేసినట్లు విని ఉంటాం. తాజాగా అలాంటి సంఘటనే ఒక్కటి జరిగింది. ఓ వృద్ధురాలికి లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వినిపించి ఆపరేషన్ చేయించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

విజయనగరం జిల్లాలోని రాజాంలోని GMR కేర్ ఆసుపత్రి వైద్యులు లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ SP మెలోడీలను వింటూ 65 ఏళ్ల మహిళకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. పక్షవాతం లక్షణాలు రావడంతో వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేయగా ఆమె మెదడులో రక్తస్రావం జరిగిన్నట్లు వెల్లడించారు. తక్షణ శస్త్రచికిత్స చేయడం అవసరమని బాధిత కుటుంబసభ్యులకు తెలిపారు. ఆమె వృద్ధురాలు కావడంతో అనారోగ్య సమస్యలు ఉండడంతో ఈ శస్త్రచికిత్స చేయడం వైద్యులకు కూడా పెద్ద సవాలుగా మారింది. సాధారణ అనస్థీషియాను ఆమెకు ఇవ్వడం చాలా ప్రమాదకరమని వైద్యులు భావించారు. ఈ సందర్భంగా ఆమెను మెలకువలోనే ఉంచి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు భావించారు.

పాటలు వింటూ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలి వీడియో:

ఈ సందర్భంగా ఆమె SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాపులర్ ట్రాక్ మాటెరాణి చిన్నదానితో సహా ఆమెకు ఇష్టమైన కొన్ని పాటలను ప్లే చేసి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయంపై డాక్టర్ కుమార్ స్పందించారు. ‘తమకు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల వారి నరాలు తేలికపడుతాయి. రోగులు సుపరిచితమైన పాటలు వినడం ద్వారా శస్త్రచికిత్స ప్రక్రియ సౌలభ్యంగా, పరధ్యానాన్ని సృష్టిస్తాయి.శస్త్రచికిత్స సెట్టింగ్‌లలో, సంగీతం విలువైన మళ్లింపుగా పనిచేస్తుంది. పీడియాట్రిక్ రోగులు ప్రక్రియల సమయంలో కార్టూన్‌లతో నిమగ్నమైనట్లే, మేల్కొని ఉన్న శస్త్రచికిత్సలలో పెద్దల రోగులు ఆందోళనను తగ్గించడానికి మరియు సహకారాన్ని మెరుగుపరచడానికి సంగీతంపై దృష్టి పెట్టవచ్చు-విజయవంతమైన ఫలితం కోసం ఈ రెండూ చాలా ముఖ్యమైనవి” అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి