Mudragada Padmanabham: ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ప్రతిపక్షాల ధర్నాలు, విమర్శలు, ఆందోళనల మధ్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇక తాజాగా చంద్రబాబు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. జరిగిన అవమానం గురించి చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను. నాడు మా కుటుంబానికి చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాల్సింది. మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య చేసుకోవడం విమరించుకున్నాను. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం దీక్ష ప్రారంభిస్తే అవమానించారు. ఇంటి తలుపులు
ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లడం చంద్రబాబుకు గుర్తు లేదా.. అంటూ లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. చంద్రబాబు పుత్రరత్నం తరచూ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అవమానించమన్నారు. రాజమండ్రి ఆసుపత్రిలో మమ్మల్ని 14 రోజులు నిర్భంధించి రాక్షసానందం పొందారు. శపథాలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, మమతా బెనర్జీ లాంటి వారికే సొంతం. చంద్రబాబు చేసిన ముఖ్యమంత్రి శపథం
నీటిమీద రాత అని గ్రహించాలి. జీవితాలు, ఆస్తుల, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదు అంటూ లేఖలో పేర్కొన్నారు.
మీరు చేసిన హింస తాలుక అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్దుర లేని రాత్రులు గడిపాం. అణిచివేత తో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా? అని లేఖలో వ్యాఖ్యానించారు. నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. మీ బంధువులు.. మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది అంటూ లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.
ఇవి కూడా చదవండి: