YCP-Congress: కాంగ్రెస్‌తో పొత్తుపై వైసీపీ క్లారిటీ.. ప్రశాంత్ కిశోర్ కామెంట్స్‌పై విజయసాయిరెడ్డి రియాక్ట్‌

|

Apr 23, 2022 | 7:04 AM

కాంగ్రెస్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పొత్తులపై స్పందించిన మంత్రి గుడివాడ.. కాంగ్రెస్, పార్టీ అధినేత సోనియాపై సంచలన ఆరోపణలు చేశారు.

YCP-Congress: కాంగ్రెస్‌తో పొత్తుపై వైసీపీ క్లారిటీ.. ప్రశాంత్ కిశోర్ కామెంట్స్‌పై విజయసాయిరెడ్డి రియాక్ట్‌
Sonia Pk Jagan
Follow us on

YCP-Congress Alliance: కాంగ్రెస్(Congress)తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు వైసీపీ(YCP) ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaisai Reddy). పొత్తులపై స్పందించిన మంత్రి గుడివాడ.. కాంగ్రెస్, పార్టీ అధినేత సోనియాపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు.. పీకే కామెంట్స్‌పై విజయసాయి రెడ్డి రియాక్ట్‌ అయ్యారు.

ఎన్నికల పొత్తుల వ్యవహారంపై వైసీపీ అధినేత, సీఎం జగన్‌ దే తుది నిర్ణయమన్నారు. పొత్తుల విషయంపై జగన్ మోహన్ రెడ్డి మాత్రమే స్పందిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కట్టుబడి.. పరిరక్షించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని అన్నారు విజయసాయిరెడ్డి. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పార్టీ వైఖరి ఎంటో సూచనప్రాయంగా తెలియజేశారు. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తుపై ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. వైఎస్ఆర్ కుంటుబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ ను భూస్థాపితం చేసేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందన్నారు. అంలాటి పార్టీతో మేము ఎందుకు కలుస్తామన్నారు మంత్రి.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్ని చేయాలనే రూల్ దేశంలో ఎక్కడ లేదన్నారు. వ్యూహాలు రచించడం వరకే పీకే వంతు.. అందులో ఏం ఇంప్లిమెంట్ చేయాలో పార్టీ అధినేత జగన్ ఇష్టమన్నారు. కాంగ్రెస్ భూస్థాపితానికి పునాది వేసిందే జగన్ మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. 2004 నుంచి 2014వరకు ఈ దేశ రాజకీయాలను శాసిస్తున్న సోనియా గాంధీని ఎదిరించిన మొట్టమొదటి మగాడు జగన్ మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు మంత్రి. 130ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ సీట్లు వెతుక్కునేలా, పొత్తు పంచుకేనాలా చేసిన నాయకుడు జగన్ అని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు ప్రసక్తే లేదని కొట్టిపారేశారు మంత్రి గుడివాడ అమర్ నాథ్.

Read Also… Chandrababu Naidu: చంద్రబాబు, బొండా ఉమకు ‘మహిళా కమిషన్’ నోటీసులు.. 27న హాజరు కావాలని..