Andhra Pradesh: భూమి ధరలు పెంచేందుకే అమరావతిని రాజధానిని చేశారు.. బాబు కర్నూలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్

|

Nov 20, 2022 | 4:02 PM

 కర్నూలు ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని కర్నూలు ఎంపి సింగరి సంజీవ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా చేయాలని అలా కాకుండా మోసపూరితంగా భూముల ధరలు పెంచుకునేందుకు అమరావతిని రాజధానిగా చేశారన్నారు సంజీవ్‌కుమార్‌.

Andhra Pradesh: భూమి ధరలు పెంచేందుకే అమరావతిని రాజధానిని చేశారు.. బాబు కర్నూలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్
Mp Singari Sanjeev Kumar On chandrababu
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. అధికార ప్రతిపక్ష నేతలు మాటల యుద్ధం ఓ రేంజ్ లో చేసుకుంటున్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ.. ఒకరిపై ఒకరు మాటలు రువ్వుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో లాయల్స్, విద్యార్థులను నుంచి నిరసన సెగను ఎదుర్కొన్నారు. తాజాగా  కర్నూలు ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని కర్నూలు ఎంపి సింగరి సంజీవ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా మహిళలు, విద్యార్దులు, న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిని ఉద్దేశించి బట్టలు ఊడదీసి కొడతామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయన్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా చేయాలని అలా కాకుండా మోసపూరితంగా భూముల ధరలు పెంచుకునేందుకు అమరావతిని రాజధానిగా చేశారన్నారు సంజీవ్‌కుమార్‌.  సీఎం వైయస్‌ జగన్‌ బిసిల సంక్షేమకోసం పనిచేస్తున్నారని కర్నూలు ఎంపి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రతిపక్షాల నేతలు మానసిక ఒత్తిడితో ప్రజలను అవమానకరంగా మట్లాడుతున్నారన్నారు. పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి సంజీవ్‌కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..