MP Gorantla Madhav: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రేసుగుర్రంలో కిల్‌బిల్‌ పాండే పాత్ర పోషిస్తున్నారని అన్నారు..

MP Gorantla Madhav: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌

Updated on: Feb 07, 2021 | 12:54 PM

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రేసుగుర్రంలో కిల్‌బిల్‌ పాండే పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎవరైనా రాజ్యాంగానికి లోబడే పని చేయాల్సి ఉంటుందని, రాజ్యాంగం గురించి తెలియకపోతే మరొకసారి చదువుకోండి.. మేధావులతో మాట్లాడండి అంటూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల నుంచి మీరు మా జోలికి వస్తే తోక కత్తిరిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ అయినా.. ఏ గడ్డ అయినా సీఎం జగన్‌ ముందు నిలవలేదని స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్‌ మధ్య వార్‌ కొనసాగుతోంది. అంతేకాదు.. వైసీపీ, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధమే కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ మొదలైనప్పటి నుంచి ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.

Also Read: మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదని ఏపీ హైకోర్టు కీలక ఆదేశం.. హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై ముగిసిన విచారణ