రెండున్నరేళ్ల బిడ్డ కనిపించడం లేదంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న తల్లి.. అనుమానంతో ఆరా తీస్తే షాక్..!

తిరుపతి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. కడపు తెంచుకున్న పుట్టిన కన్నబిడ్డనే అతి కిరాతకంగా హతమార్చింది ఓ తల్లి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని, రెండున్నరేళ్ల కన్న కూతురిని చంపేసింది. పోస్టల్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రెండున్నరేళ్ల బిడ్డ కనిపించడం లేదంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న తల్లి.. అనుమానంతో ఆరా తీస్తే షాక్..!
Mother Kills Daughter

Updated on: Feb 25, 2026 | 12:00 PM

తిరుపతి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. కడపు తెంచుకున్న పుట్టిన కన్నబిడ్డనే అతి కిరాతకంగా హతమార్చింది ఓ తల్లి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని, రెండున్నరేళ్ల కన్న కూతురిని చంపేసింది. పోస్టల్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మొదటి భర్తతో విడిపోయి, రెండున్నరేళ్ల కూతురితో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది ఆశాలత. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన రెడ్డి కుమార్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లితో అడ్డుగా మారిన కన్న కూతురును వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే పక్కా ఫ్లాన్ వేసి అమలు చేసింది. ఫిట్స్‌తో కూతురు చనిపోయిందంటూ రెడ్డి కుమార్‌కు సమాచారం ఇచ్చింది. చనిపోయిన చిన్నారిని నాయుడుపేట నుంచి గుడిమల్లం వెళ్లే మార్గంలో చెన్నంపల్లి వద్ద మామిడి తోటలో పూడ్చిపెట్టింది ఆశాలత. ఆ తర్వాత పెద్ద నాటకానికి తెర లేపింది.

కూతురిని చంపి, ఏం తెలియదన్నట్లు తన బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది ఆశాలత. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి కూతురు కనిపించడం లేదంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో తల్లి నాగరత్నమ్మతో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని, విచారించిన పోలీసులకు నిప్పులాంటి నిజం బయటపడింది. ఆశాలతతోపాటు రెడ్డి కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. దీంతో నిందితులు ఇద్దరు అసలు నేరాన్ని ఒప్పుకున్నారు. తమ బంధానికి కూతురు అడ్డు తొలగించుకోవడానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు వివరించారు. దీంతో రెండున్నరేళ్ల బాలిక డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చెన్నంపల్లి ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఏర్పేడు తహసిల్దార్ సమక్షంలో శవాన్ని బయటకు తీసే పోస్టుమార్టం నిర్వహించారు. అశాలత, రెడ్డి కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us