Andra Pradesh: అయ్యో.. ఎంతపని చేశావ్‌ లక్ష్మమ్మ.. ముక్కుపచ్చలారని చిన్నారులతో కలిసి..

యర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని వేంపల్లి రోడ్డులో గల ఆంజనేయ స్వామి గుడి వెనుక ఉన్న గనిలో దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. గనిలో దూకిన..

Andra Pradesh: అయ్యో.. ఎంతపని చేశావ్‌ లక్ష్మమ్మ.. ముక్కుపచ్చలారని చిన్నారులతో కలిసి..
Suicide

Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2022 | 3:13 PM

mother and children suicide: వరదనీటితో నిండి ఉన్న గనిలో దూకి తల్లిపిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం యర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని వేంపల్లి రోడ్డులో గల ఆంజనేయ స్వామి గుడి వెనుక ఉన్న గనిలో దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. గనిలో దూకిన వారు లక్ష్మీదేవి, అక్షయ(8), రేవంత్(6)గా గుర్తించారు. ఆంజనేయుడి సాక్షిగా జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వేంపల్లి రోడ్డులో గల ఆంజనేయస్వామి గుడి వెనుక తవ్వకాలు చేపడుతున్న గని వరదనీటితో నిండి ఉంది. ఆ గనిలో యర్రగుంట్లలో నివాసముంటున్న లక్ష్మీదేవి తన పిల్లలు అక్షయ (8) రేవంత్‌ (6) లతో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముమ్మర సహాయక చర్యలు చేపట్టిన పోలీసులకు తొలుత ఇద్దరు చిన్నారుల మృతదేహలు లభించాయి. కానీ, తల్లీ లక్ష్మీ ఆచూకీ లభించలేదు. లక్ష్మీదేవి ఆచూకీ కోసం మరింత లోతులో గాలించగా ఆమె మృతదేహం లభించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి