Allagadda High-Tension: ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియ మాస్ వార్నింగ్‌.. ఆళ్లగడ్డలో హైటెన్షన్‌!

|

Oct 18, 2024 | 9:56 AM

ఫ్యాక్షన్‌ గడ్డ అయిన ఆళ్లగడ్డ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య డైలాగుల డైనమేట్లు ఓరేంజ్‌లో పేలుతున్నాయి.

Allagadda High-Tension: ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియ మాస్ వార్నింగ్‌.. ఆళ్లగడ్డలో హైటెన్షన్‌!
Mla Akhila Priya Mass ,av Subba Reddy
Follow us on

ఫ్యాక్షన్‌ గడ్డ అయిన ఆళ్లగడ్డ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య డైలాగుల డైనమేట్లు ఓరేంజ్‌లో పేలుతున్నాయి. ఆళ్లగడ్డ వదిలివెళ్లాలని ఏవీకి అఖిలప్రియ మాస్‌ వార్నింగ్ ఇస్తే.. ఏం జరిగినా ఆళ్లగడ్డలోనే తేల్చుకుంటానంటూ కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు ఏవీ సుబ్బారెడ్డి. ఇక ఇద్దరి మధ్య పవర్‌ ఫుల్‌ డైలాగులతో ఆళ్లగడ్డలో హైటెన్షన్‌ నెలకొంది.

అఖిల ప్రియ ఆన్‌ ఫైర్..! పెద్దోళ్లైనా, బందువులైనా నో కాంప్రమైజ్ అంటున్నారు. తేడా వస్తే రచ్చ రచ్చ చేస్తున్నారు. మేనమామ అయిన విజయ డైయిరీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మొన్న తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఫోన్‌లోనే పబ్లిక్‌గా మాటల తూటాలు పేల్చారు. లేటెస్ట్‌గా మాజీ మంత్రి ఏవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహావేశాలు వెల్లగక్కారు. ఊరు వదిలివెళ్లిపోవాల్సిందేనంటూ మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది అఖిల ప్రియ వ్యవహారం. ఇటు ఆళ్లగడ్డలోనూ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఆళ్లగడ్డ నా అడ్డా అంటున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఏవీ సుబ్బారెడ్డిపై ఓరేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే.. వెంటనే ఆళ్లగడ్డను వదిలేసి వెళ్లిపోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేశారు. అంతేగాక, పోలీసులతోనూ సుబ్బారెడ్డిపై ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఏవీ సుబ్బారెడ్డి సైతం ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. నేనెందుకు ఆళ్లగడ్డ నుంచి వెళ్లిపోవాలి…? నాకు ఒకరు చెప్పేదేంటి…? ఏం చేస్తారో చూస్తా… ఆళ్లగడ్డలోనే తేల్చుకుంటానంటూ ఏవీ కూడా ఓరేంజ్‌లో అఖిలప్రియపై ఫైర్‌ అవుతున్నారు. నేనెందుకు ఊరు వదిలి వెళ్లాలి…? ఏం చేశానని వెళ్లమంటున్నారంటూ…? నిప్పులు చెరుగుతున్నారు.

ఇక ఇద్దరి మధ్య డైలాగ్‌ వార్ పీక్స్‌కి చేరడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఏవీ సుబ్బారెడ్డిని కాంప్రమైజ్‌ చేసే పనిలో పడ్డారు. టెన్షన్‌ వద్దు వెళ్లిపోండంటూ ఏవీకి పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఏవీ ఏమాత్రం తగ్గనంటున్నారట. ఏం జరుగుతుందో చూస్తానంటున్నారట ఏవీ సుబ్బారెడ్డి. దీంతో ఆళ్లగడ్డలో హైటెన్షన్‌ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇద్దరిపైనా నిఘా పెట్టారు. మొన్నటికి మొన్న విజయ డెయిరీ చైర్మన్‌ జగన్‌ మోహన్ రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు అఖిలప్రియ. డెయిరీకి వెళ్లి మరీ జగన్‌ ఫోటో తీసేసి చంద్రబాబు ఫోటోను పెట్టారు. డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫైర్ అయ్యారు.

ఇలా రోజుకొకరిపై విరుచుకుపడుతున్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ. విజయ డైరీ చైర్మన్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చినా 24 గంటలు గడవకముందే.. ఏవీ సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ అల్టిమేటం జారీ చేయడం ఇప్పడు చర్చనీయాంశమైంది. అసలు ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్‌ రచ్చ లేపుతోంది.

మరోవైపు, వైసీపీ నేత, విజయ మిల్క్ డైరీ చైర్మన్, ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి భూమా జగత్ సైతం మాస్ వార్నింగ్ ఇచ్చారు. అక్క అఖిల ప్రియ గురించి ఏ ఒక్క మాట జారిన పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించారు. విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు మొత్తం తెలుసన్న జగత్, త్వరలోనే ఎస్‌వీ జగన్ బండారం బయటపెడతాననన్నారు.

ఇదిలావుంటే, నిన్న మధ్యాహ్నం ఆళ్లగడ్డలో తన ఇంటికి వచ్చి ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమైన ఏవీ సుబ్బారెడ్డి పోలీసుల సూచనల మేరకు విరమించుకున్నారు. ఆపై ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఉండటానికి వీలు లేదంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. అయితే తాను ఆళ్లగడ్డను వీడి వెళ్లబోనంటూ ప్రకటించారు ఏవీ సుబ్బారెడ్డి. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఆళ్లగడ్డ పరిణామాలపై ఇవాళ్టి ఎమ్మెల్యేల సమావేశంలో ఆరా తీయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇద్దరి మధ్య వివాదంతో ప్రజలు ఆందోళనకు గురయ్యే పరిస్థితి తీసుకురావద్దంటున్నారు పార్టీ పెద్దలు. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కొన్నేళ్లుగా వివాదం రాజుకుంది. ఘర్షణలు, పరస్పరం హత్యాయత్నం కేసులు సాధారణంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..