చివరికి విషాదమే మిగిలింది. తమ చిన్నారి ఏదో అద్భుతం జరిగి బతుకుతాడేమోనని ఆశించిన ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరే అయ్యాయి. విజయవాడలో డ్రైనేజీలో గల్లంతైన అభిరామ్ మృత్యువాత చెందాడు. ప్రమాద స్థలానికి సమీపంలోనే పసివాడి మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. ఆయుష్ ఆసుపత్రి సమీపంలో నాలాలో బాలుడి మృతదేహాం లభ్యమైంది. దీంతో అభిరామ్ పేరెంట్స్ దుఃఖానికి అంతే లేకుండా పోయింది. కొడుకు లేరన్న వార్తతో ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
ఇదిలా ఉంటే విజయవాడ గురునానక్ కాలనీకి చెందిన అభిరామ్ అనే ఐదేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. విజయవాడలో ఇవాళ (మే 5) గంటన్నరపాటు భారీవర్షం కురిసింది. దీంతో కాలనీలు జలమయమయ్యాయి. మరోవైపు గా గత కొన్ని నెలలుగా బెజవాడలో ఓపెన్ నాలాలు భయపెడుతున్నాయి. ఈక్రమంలోనే ఓపెన్ నాలాలో పడి అభిరాయ్ గల్లంతయ్యాడు. కుమారుడి గల్లంతు విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. సరదాగా ఆడుకుంటూ వెళ్లిన పిల్లాడు కాల్వలో పడి కొట్టుకుపోయాడు. మొత్తం నలుగురు పిల్లలు కాలనీలో ఆడుకుంటూ ఉన్నారని, ఇంతలో ఓ పిల్లాడు నాలాలో పడిపోయాడని స్థానికులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..