Andhra News: రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. డ్రైవర్ చేసి పనితో..

నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి వినుకొండ వెళ్తుండగా నాయుడుపేట విన్నమాల వద్ద ఆర్టిసి బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేయడంలో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు సంగం మేర కాలిపోగా ఘటనా స్థలానికి చేరకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Andhra News: రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. డ్రైవర్ చేసి పనితో..
Rtc Bus Fire Nellore

Updated on: Feb 06, 2026 | 11:18 AM

28 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో వెలుగు చూసింది. రోడ్డుపై బస్సులో మంటలను గమనించిన స్థానిక వాహనదారులు కేకలు వేడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేయడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 29 మంది ప్రయాణికులతో ఓ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి పల్నాడు జిల్లా వినుగొండకు బయల్దేరింది. బస్సు సరిగ్గా విన్నమాల వద్దకు రాగానే బస్సు వెననుంచి పొగలు రావడం మొదలయ్యాయి. అది గమనించిన స్థానికులు కేకలు వేడంతో అప్రమత్తమైన పాసింజర్స్ డ్రైవర్‌కు తెలిపారు. వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపేసి ప్రయాణికులను కిందకు దించేశాడు. ఇంతలో మంటలు బస్సులోపలికి వ్యాపించాయి.

అప్పటికే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బస్సులోని బ్యాటరీ వైర్ల షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను గమస్యస్థానాలకు చేర్చినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.