“ముగ్గురు అన్నదమ్ములకీ రాజకీయ భవిష్యత్ లేదు. అంత స్థాయిలో ఉండి కూడా ఎవరికీ సాయం చెయ్యరు. అందుకే ముగ్గుర్నీ సొంత జిల్లాలోనే ఓడించారు.” ఇవీ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఈ నెల 5న రోజా చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్‌పైనే నాగబాబు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. నీ పర్యాటకరంగం దేశంలో 18వ స్థానం. అది ఇంకా దిగజారకముందే నీ పని నువ్వు చూసుకో. పర్యాటక మంత్రి అంటే నువ్వు పర్యటనలు చెయ్యడం కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు నాగబాబు. పిచ్చపిచ్చ మాటలు ఆపకపోతే బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. నాగబాబు కామెంట్స్‌కు గట్టిగానే మరో కౌంటర్ ఇచ్చారు రోజా.
“ఏదైనా విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలి.. అంతే గానీ నోటికి ఎంత వస్తే అంత వాగడం, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం సబబు కాదు. ఏమీ తెలియకుండా నా శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం సహించలేకున్నాను. నేను పర్యాటక శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక ఇండియాలో ఏపీ టూరిజం మూడో స్థానంలో ఉంది. ఇదేమీ తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. నేను ఏనాడు చిరంజీవిగారు కేంద్రమంత్రిగా పర్యాటకంగా ఏపీకి ఏం చేసారని రాజకీయంగా మాట్లాడలేదు. మాట్లాడను కూడా. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి. గతంలో మీరు మీరూ (టీడీపీ-జనసేన) మాట్లాడుకున్న మాటల్నే గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు గతంలో వాళ్లేం మాట్లాడుకున్నారో చూపించి.. సదరు వ్యక్తి కి ఈ వీడియో చేరేలా ఉండాలని షేర్ చేస్తున్నా.. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. పార్టీ పరంగా, సిద్ధాంతపరంగా నా వ్యాఖ్యలుంటాయని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. నన్ను అంత మాట అన్నందుకు మిమ్మల్ని కూడా ఓ మాట అనొచ్చు.. కానీ నా సంస్కారం అడ్డొచ్చింది అంతే.. చివరకిగా ఒక్క మాట.. ఆనాడు మీ పార్టీ వాళ్లను స*కజాతి, అలగా జనం అని అంత హీనంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుందో పైవాడికే తెలియాలి. ఓడిపోయిన మీరే అన్ని మాటలంటే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను ఎంత అనాలి. రాజకీయ విమర్శలు తప్పా, వ్యక్తిగత విమర్శలు చేయడం నాకిష్టం లేక మిమ్మల్ని ఆ మాట అనలేక వదిలేస్తున్నా.. ముందు మహిళను ఎలా గౌరవించాలో తెలుస్కోండి.” అంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు రోజా.