ఎన్టీఆర్ కృష్ణ జిల్లా జగ్గయ్యపేటలో మంత్రి రోజా విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి కాసేపు సరదాగా గడిపారు. SVM ప్రసాద్ స్మారక మహిళా కబడ్డీ పోటీల ముగింపునకు ముఖ్య అతిథిగా మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. మహిళ కబడ్డీ పోటీల్లో మంత్రి ఆర్కే రోజా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, సామినేని విమల భాను విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ పోటీల్లో విజేతలకు మంత్రి రోజా బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. మహిళలంటే వంటింటి కుందేళ్లు కాదన్నారు. ఒక్కసారి మహిళలకు అవకాశమిస్తే అద్భుతాలు సృష్టిస్తూ ఆకాశంలోకి దూసుకు పోతారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు. అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతని ప్రశంసల వర్షం కురిపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..